త్వరలో ఇండియాలో ఈ-రిక్షాలు తిరగనున్నాయి... హోండా కంపెనీ ప్లాన్ ఇదే!

కరోనా ప్రపంచాన్ని పూర్తిగా మార్చివేసిందని చెప్పుకోవాలి.దాని ఫలితంగా వచ్చిన విపత్తుల సంగతి అందరికీ తెలిసినదే.

 Honda To Begin Battery Sharing Service For Electric Auto Rikshaw,honda,electric-TeluguStop.com

అయితే ఈ క్రమంలో కొన్ని ఇన్వెన్షన్స్ కూడా జరిగాయి.అందులో మోటారు ఫీల్డ్ ఒకటి.

ముఖ్యంగా కరోనా తరువాత ఇంధన ధరలు భారీగా పెరగడంతో జనాలు ఎలక్ట్రిక్ బళ్ళవైపు మొగ్గు చూపుతున్నారు.ఈ క్రమంలోనే అనేక కంపెనీలు పుట్టుకొచ్చాయి.

ఒకప్పుడు ఇంధన వాహనాలకు బదులుగా ఎలక్ట్రిక్ వాహనాలు వాడితే కాలుష్యం తగ్గుతుందని, తద్వారా దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పినా వినని జనాలు నేడు ఇంధన వాహనాలు వాడకం ఖరీదు కావడంతో తప్పనిసరి పరిస్థితులలో ఈ-వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు.

ఈ క్రమంలో మరో దిగ్గజ ఆటో మొబైల్ కంపెని ఎలక్ట్రిక్‌ ఆటోరిక్షాలు తీసుకొచ్చే పనిలో పడింది.

హోండా ఈ మంగళవారం ఎలక్ట్రిక్ రిక్షాల కోసం తన బ్యాటరీ షేరింగ్ సర్వీస్‌ను ఇండియాలో తీసుకురావాలని యోచిస్తున్నట్లు ప్రకటించడం విశేషం.ఈ ఏడాది చివరి నాటికి భారతదేశంలో ఈ సేవలను లాంచ్‌ చేయాలని చూస్తోంది.

ఇక బ్యాటరీ షేరింగ్ సర్వీస్‌ అందుబాటులోకి వస్తే.ఆటోరిక్షా డ్రైవర్లు సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్‌కి వెళ్లి ఛార్జింగ్ తక్కువగా ఉన్న లేదా పూర్తిగా ఛార్జింగ్ అయిపోయిన తమ బ్యాటరీని అందించి ఫుల్ ఛార్జింగ్ ఉన్న బ్యాటరీని తీసుకోవచ్చు.

Telugu Battery, Rikshaw, Electricauto, Honda, India, Ups-Latest News - Telugu

తద్వారా వారికి సమయం అనేది అసలు వృథా కాదు.అలాగే వారి వాహనం కంటిన్యూగా వర్కింగ్‌లోనే ఉంటుంది.ఇక ప్రయాణికులకు కూడా తమ సమయం ఆదా అవుతుంది.ఇటీవల యూరప్‌లోని బ్యాటరీ కన్సార్టియంలో పాల్గొన్న హోండా కంపెనీ స్వాపబుల్ బ్యాటరీలను ఒక స్టాండర్డ్‌గా తీసుకురావడానికి భారత్‌లోని ఓ పార్ట్‌నర్ కంపెనీతో కలిసి పని చేస్తున్నామని తెలపడం గమనార్హం.

ఈ సందర్భంగా 2050 నాటికి తన అన్ని ప్రొడక్ట్స్, కార్పొరేట్ యాక్టివిటీస్ కార్బన్ న్యూట్రాలిటీని చేరుకోవాలనే లక్ష్యంలో భాగంగా ఒక వ్యూహం రచిస్తోన్నట్లు కంపెనీ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube