పెళ్లైన మహిళతో స్వలింగ సంబంధం.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు..!

భార్య వేరే అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకోవడం లేదా భార్త వేరే మహిళతో సంబంధం పెట్టుకోవడం జరుగుతూ ఉంటాయి.ఇలాంటి సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చులు పెడుతుంటాయి.

 Homosexuality With A Married Woman  The Court Gave A Sensational Verdict  Court-TeluguStop.com

ఇక బంధాల ఉచ్చులో పడి భార్యను భర్త చంపడం లేదాభర్తను భార్య చంపే సంఘటనలు బోలెడన్నీఇక ఓ కుటుంబంలో తల్లిదండ్రులు చేసే తప్పుల వలన వారి పిల్లలు ఆ శిక్షణలను అనుభవించాల్సి వస్తుంది.ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు లెక్కలేనన్ని చూస్తున్నాం.

తాజాగా డిఫరెంట్ స్టోరీ వెలుగులోకి వచ్చింది.కానీ ఇందులో ఓ అమ్మాయి అబ్బాయి లేదా భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం కాదండోయ్.

ఇద్దరు మహిళలు అక్రమ సంబంధం పెట్టుకోవడం.అవును ఇది నిజమే ఓ వ్యక్తి భార్య మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంది.

ఇది తెలుసుకున్న భర్త తనకు న్యాయం కావాలంటూ కోర్టును ఆశ్రయించాడు.దీంతో ఆ భార్యకు అనుకోని షాకిచ్చింది కోర్టు.

జపాన్‏లో నివాసముండే ఓ భార్యభర్తలు ఎప్పుడు సంతోషంగా ఉండేవారు.అయితే తన భార్య ప్రవర్తనలో మార్పు గమనించిన అతడు అసలు విషయం ఎంటీ అని తెలుసుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నించాడు.

ఈ క్రమంలో అతనికి షాకింగ్ విషయాలు తెలిసాయి.అతని భార్య మరో అమ్మాయితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుందని ఆమెతో శృంగారంలో పాల్గోంటుందని తెలిసి అతనికి దిమ్మతిరిగిపోయింది.వెంటనే తనకు న్యాయం చేయాలని టోక్యో కోర్టును ఆశ్రయించాడు.ఇతని వాదనలు విన్న కోర్టు ఆ మహిళకు భారీగా జరిమానా విధించింది.అంతేకాదు ఆ మహిళకు ఒక వివాహమైన స్త్రీతో శృంగారంలో పాల్గోన్నందుకు అదనంగా మన కరెన్సీ ప్రకారం రూ.70 వేలు ఇవ్వాలని ఆదేశించింది.అయితే ఈ తీర్పు విన్న సదరు యువతి అతడి భార్యకు తనకి మధ్య జరిగింది చట్టారీత్యా నేరం కాదని దీని వలన అతడి దాంపత్య జీవనానికి ఎలాంటి హాని జరగలేదని కోర్టుతో వాదనకు దిగింది.దీనిపై స్పందించిన కోర్టు పెళ్లైన మహిళతో లైంగిక సంబంధం పెట్టుకోవడం అంటే ఆ కుటుంబాన్ని అశాంతికి గురిచేయటమేనని అందుకు జరిమానా చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

ప్రస్తుతం ఈ ఘటన జపాన్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.స్వలింగ సంపర్కానికి జపాన్ కోర్టు వ్యతిరేకమని పలువురు అభిప్రాయపడుతున్నారు.నచ్చిన వ్యకులతో ఇష్టపూర్వకంగా కలవడం కూడా తప్పుగా భావిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube