టిక్ టాక్ వీడియో లో హోంమంత్రి మనవడు ఏమిచేశాడో తెలుసా  

Home Minister Grandson In Tik Tok Video-

ఈ టిక్ టాక్ ల పిచ్చి సామాన్యులకే కాకుండా సినీ,రాజకీయ ప్రముఖులకు కూడా ఈ టిక్ టాక్ ఫీవర్ పెరిగిపోతుంది.దీనికి నిదర్శనం తాజాగా తెలంగాణా హోంమంత్రి మహమూద్ అలీ మనవడి టిక్ టాక్ వీడియో.ఈ వీడియో పై ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతుంది...

Home Minister Grandson In Tik Tok Video--Home Minister Grandson In Tik Tok Video-

పోలీస్ శాఖకు చెందిన కారుపై కూర్చొని వీడియో తీయడమే కాకుండా ఐజీ ని బెదిరిస్తూ వీడియో ఉండడం తో నెటిజన్లు తెగ మండిపడిపోతున్నారు.పోలీస్ శాఖకు చెందిన వాహనం నెంబర్ TS09PA 9999 పార్క్ చేసింది.ఆ కారుపై మంత్రి మనవడు ఫుర్ఖాన్ అహ్మద్, అతడి స్నేహితుడు కూర్చొని టిక్‌టాక్ వీడియో చేశారు.వీడియోలో మంత్రి మనవడు స్నేహితుడితో కలిసి వాహనంపై కూర్చొన్నాడు.

అతడి స్నేహితుడు వాహనం కిందకు దిగి ఐజీని బెదిరిస్తున్నట్లు గొంతు కోసేస్తానంటూ హెచ్చరించాడు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనితో ఆ వాహనం నెంబర్ ని ట్రేస్ చేయగా అది డీజీపీ పేరు మీద ఉండడం మరిన్ని విమర్శలకు దారి తీసింది.

Home Minister Grandson In Tik Tok Video--Home Minister Grandson In Tik Tok Video-

ఇక అంతే ఆ వీడియో సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఆ వీడియో లో ఉంది హోంమంత్రి మనవడిగా గుర్తించి మరిన్ని విమర్శలు చేయడం మొదలు పెట్టారు.దీనితో హోంమంత్రి మనవడై ఉండి ఇలా పోలీస్ శాఖకు చెందిన కారుపై కూర్చొని ఇలా వీడియో లు తీయడం,వారిని బెదిరించడం వంటివి చేయడం పై నెటిజన్లు మండిపడుతున్నారు.