ఇంట్లోనే ఉన్నాయి మొబైల్స్, గాడ్జెట్స్ ని క్లీన్ చేసుకునే వస్తువులు

కంప్యూటర్, లాప్ ట్యాప్, స్మార్ట్ ఫోన్ .ఇలా ప్రతీరోజు టెక్నాలజీని చేతిలో పెట్టుకోనే బ్రతుకుతున్నాం మనం.

 Homemade Tips For Cleaning Electronics-TeluguStop.com

పచ్చిగా చెప్పాలంటే, టెక్నాలజీ లేకుండా మనం ఓ పూట కూడా సరిగా గడపలేం.అవసరానికో, సరదాకో .టెక్నాలజీ మాత్రం కావాలి.కాని వాడినాకొద్ది అవి పాతబడిపోతుంటాయి.

దుమ్ము పట్టేస్తుంది.ఇలాంటప్పుడు ఏం చేయాలి? బయటకి వెళ్ళి ఏదో లిక్విడ్ కొనాల్సిన పనిలేదు.ఇంట్లో ఉండే మన వస్తువులను మనం శుభ్రం చేసుకోవచ్చు.

* కీబోర్డుకి దుమ్ముపడితే తుడవడం చాలా కష్టం అయిపోతుంది.కీస్ మధ్యలో దుమ్ము ఇరుక్కుపోతుంది.ఇలాంటప్పుడు సాఫ్ట్ మేకప్ బ్రష్ ఉపయోగిస్తే మంచిది.

అలాగే స్టిక్ నోట్స్ సహాయం ద్వారా బటన్లపై పేరుకుపోయిన దుమ్ముని తొలగించవచ్చు.

* కాటన్ స్వాబ్ ను ఆల్కాహాల్ లో ముంచి ప్లాస్టిక్ భాగలఫై రాస్తే తళతళా మెరిసిపోతాయి.

ప్లాస్టిక్ తో తయారుచేసిన ఏ వస్తువైనా సరే, ఈ టీప్ ని పాటించండి.

* ఈయర్ ఫోన్స్ ని క్లీన్ చేయాలంటే మాత్రం టూత్ బ్రష్ వాడటం కరెక్ట్.

డిష్ వాటర్ లిక్విడ్ తో కూడా పనవుతుంది.

* టీవి స్క్రీన్, మొబైల్ స్క్రీన్, కంప్యూటర్ స్క్రీన్ ని శుభ్రపరుచుకోవాలంటే కాఫీ – ఫిల్టర్స్ ని వాడండి.

* ఎలక్ట్రానిల్ పరికరాణలను క్లీన్ చేసుకోవడానికి ప్రత్యేకంగా బయటి నుంచి క్లీనింగ్ లిక్విడ్స్ కొనేకంటే మీరే సొంతంగా తయారుచేసుకుంటే మంచిది.వెనిగర్ లో డిస్టిల్డ్ వాటర్ తో పాటు, రిబ్బంగ్ ఆల్కహాల్ కలిపి మీరే సొంతంగా ఒక క్లీనింగ్ లిక్విడ్ తయారు చేయవచ్చు.

ఇది ప్రభావంతంగా ఉంటూనే, డబ్బులు కూడా ఆదా చేస్తుంది.

* లింట్ – రోలర్ వాడి సౌండ్ స్పీకర్స్ లో ఇరుక్కుపోయిన దుమ్ముని బయటకి తీయవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు