పగిలిన పెదవులకు సహజసిద్దమైన స్క్రబ్స్  

Homemade Scrubs For Chappedlips -

పెదవులు పగిలితే ముఖం చిరాకుగా ఉండటమే కాకుండా చాలా ఇబ్బందిగా ఉంటుంది.ప్రతి ఒక్కరు అందమైన పెదాలు కావాలని కోరుకుంటారు.

అయితే అందమైన పెదాల కోసం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.అలాగే మనకు అందుబాటులో ఉండే కొన్ని సహజసిద్ధమైన పదార్ధాలతో పగిలిన పెదాలను మృదువుగా,అందంగా చేసుకోవచ్చు.

పగిలిన పెదవులకు సహజసిద్దమైన స్క్రబ్స్-Telugu Health-Telugu Tollywood Photo Image

ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ ఉడికించిన ఓట్ మీల్ లో ఒక స్పూన్ బాదం నూనె వేసి బాగా కలిపి పెదవులపై రాసి సున్నితంగా మసాజ్ చేయాలి.5 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ లో అరస్పూన్ బ్రౌన్ షుగర్ వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమాన్ని పెదాలకు రాసి సున్నితంగా మసాజ్ చేయాలి.5 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

ఒక స్పూన్ పుదీనా పేస్ట్ లో ఒక స్పూన్ రోజ్ వాటర్, ఒక స్పూన్ కోకో పౌడర్ కలిపి పెదాలకు రాసి సున్నితంగా మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే వారం రోజుల్లో మంచి ఫలితం కనపడుతుంది.

ఒక స్పూన్ పంచదారలో ఒక స్పూన్ కొబ్బరి నూనె,ఒక స్పూన్ నిమ్మరసం కలిపి పెదాలకు రాసి 5 నిముషాలు సున్నితంగా మసాజ్ చేసి చాలాల్ని నీటితో శుభ్రం చేయాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Homemade Scrubs For Chappedlips Related Telugu News,Photos/Pics,Images..

footer-test