ముడతలను తగ్గించే తేనె,అల్లం ఫేస్ మాస్క్       2018-06-07   23:53:08  IST  Lakshmi P

సాదారణంగా వయస్సు పెరిగే కొద్ది ముడతలు వస్తూ ఉంటాయి. అయితే ఈ రోజుల్లోవయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న వయస్సులోనే ముడతలు వచ్చేస్తున్నాయి. చర్మం మీద ముడతలు రావటం వలన చర్మం నిస్తేజంగా కనపడటమే కాకుండా నిదానంగా మృదుత్వాన్ని కూడా కోల్పోతుంది. ముడతలు ప్రారంభ దశలో ఉంటే చికిత్స చేయటం చాలా సులభం. ముడతల పరిష్కారానికి తేనె మరియు అల్లం ఫేస్ మాస్క్ బాగా సహాయపడుతుంది.

తేనె మరియు అల్లం ఫేస్ మాస్క్

కంటి చుట్టూ ఉండే సున్నితమైన ప్రాంతంలో ఎక్కువగా ముడతలు వస్తాయి. దీనికి అల్లం,తేనే ఉత్తమ పరిష్కారం అని చెప్పవచ్చు. తేనెలో సహజమైన హైడ్రేట్ లక్షణాలు ఉండటమే కాకా మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అల్లం కంటి చుట్టూ లైన్ల రూపాన్ని తగ్గించడం మరియు కన్ను ప్రాంతం చుట్టూ రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుంది. కళ్ళ చుట్టూ లైన్స్ నివారించటానికి ఈ అద్భుతమైన నివారణ మార్గంను ఎంచుకోండి.

కావలసినవి

సేంద్రీయ తేనే – ½ స్పూన్
తాజా అల్లం – 1 అంగుళం ముక్క
రోలు
పలుచని వస్త్రం

పద్దతి

1. ముందుగా అల్లం తొక్క తీసి రోటిలో వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి.
2. ఈ పేస్ట్ ని పలుచని గుడ్డలో వేసి అల్లం రసం తీయాలి.
3. ఒక స్పూన్ తాజా అల్లం రసంలో ఒక స్పూన్ తేనే కలపాలి.
4. ఈ మిశ్రమాన్ని ఉంగరం వేలి సాయంతో కంటి చుట్టూ రాయాలి.
5. ఒక నిమిషం పాటు నిదానంగా వృత్తాకారంగా మసాజ్ చేయాలి.
6. ఈ ప్యాక్ ని 20 నిమిషాల పాటు అలా వదిలేస్తే పొడిగా ఆరిపోతుంది.
7. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రంగా కడగాలి.
8. ఈ ప్యాక్ ని రోజుకి ఒకసారి వేసుకుంటే మంచి పలితం కనపడుతుంది.