అమెరికాలో భారీ మోసం..ఆ ముగ్గురుపై కేసులు నమోదు..   Homeless Veteran Who Won $400,000 Through GoFundMe Back On The Streets     2018-11-17   15:10:18  IST  Surya

గత ఏడాదిలో అమెరికాలో ఓ భారీ మోసం జరిగింది..సాయం చేయాలని అభ్యర్ధించిన మరుక్షణంలోనే ఓ మహిళ ఖాతాలోకి కోట్ల రూపాయలు వెల్లువలా వచ్చి పడ్డాయి దాంతో ఒక్క సారిగా వారు ఉడాయించారు..ఇది గతంలో సంచలనం సృష్టించింది అయితే ఇప్పుడు వారిపై అనేక భియోగాలు మోపుతూ కేసు నడుస్తోంది..వివరాలలోకి వెళ్తే.

ఏడాది కిందట కేట్‌లిన్ మెక్‌క్లూర్ అనే మహిళ ఓ ఇల్లు లేని వ్యక్తి కోసం విరాళాలు సేకరిస్తున్నదంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది…

ఫిలడెల్ఫియా సమీపంలో తన కారు ఆగిపోవడంతో ఓ ఇల్లు లేని వ్యక్తి తన దగ్గర ఉన్న చివరి 20 డాలర్లతో కారుకు ఇంధనం కొట్టించి తనను ఆదుకున్నాడని, దీనికి ప్రతిగా తాను ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో విరాళాలు సేకరిస్తున్నట్లు ఆమె తెలిపింది. దీనికోసం గోఫండ్‌మీ ద్వారా సుమారు 4 లక్షల డాలర్లు (సుమారు రూ.3 కోట్లు) సేకరించింది..అందంతా పెద్ద మోసమని తేలింది..దాంతో ఈ నాటకాన్ని నడిపించిన ముగ్గురు వ్యక్తులపై న్యూజెర్సీ కోర్టులో కేసు నడుస్తున్నది.

Homeless Veteran Who Won $400 000 Through GoFundMe Back On The Streets-Homeless NRI Telugu News Updates

అయితే సదరు ఇల్లు లేని బాబిట్ అనే వ్యక్తి ఈ ఏడాది ఆగస్ట్‌లో ఈ జంటపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయమంతా బయటపడింది. వాళ్లు తనకు కేవలం 75 వేల డాలర్లు మాత్రమే ఇచ్చి.. మిగతా సొమ్ముతో ఓ బీఎండబ్ల్యూ కారు కొనుక్కుని తిరుగుతున్నారని అతడు ఆరోపించాడు దాంతో అసలు విషయం తెలుసుకున్న పోలీసులు తీగలాగితే డొంక కదలింది.. ఈ ముగ్గురూ కలిసి ఈ కథంతా అల్లి ఈ భారీ స్కాంకు పాల్పడినట్లు పోలీసులు నిర్దారించారు..ఈ ముగ్గురిపై కుట్ర కేసు నమోదు చేశారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.