అమెరికాలో పెను సంక్షోభం: పెరుగుతున్న నిరాశ్రయులైన విద్యార్ధులు

అమెరికాలో నిరాశ్రయుల సంక్షోభం రోజు రోజుకి తీవ్రమవుతోంది.కొత్త అధ్యయనం ప్రకారం గడచిన దశాబ్ధంలో నిరాశ్రయులైన విద్యార్ధుల శాతం అధికంగా ఉంది.

 Homeless Us Student Population-TeluguStop.com

ఇళ్లను కోల్పోయిన తర్వాత నిరాశ్రయులైన పిల్లలు రోడ్డు మీదనో.ఇతర కుటుంబాలు లేదా, స్నేహితులతోనో ఉన్నట్లు తేలింది.

వీరిలో 7 శాతం మంది పాడుబడిన భవనాలు, కార్లలో నివసిస్తున్నట్లు నేషనల్ హోమ్ ఫర్ హోమ్‌లెస్ ఎడ్యుకేషన్ గణాంకాలు చెబుతున్నాయి.ఉద్యోగ అభద్రత, భరించలేని గృహ నిర్మాణ వ్యయం, గృహ హింసతో తాజాగా ఓపియాయిడ్ సంక్షోభం కారణంగా నిరాశ్రయుల సంఖ్య నానాటికి పెరుగుతోంది.

స్ధిరమైన చిరునామా లేకుండా జీవించడం పిల్లల విద్య, ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నిరాశ్రయులైన విద్యార్ధులలో మూడో వంతు కంటే తక్కువ మంది సాధారణ విద్యాభ్యాసం చేశారు.

అంతేకాకుండా వీరు మ్యాథమేటిక్స్, సైన్స్ వంటి సబ్జెక్టుల్లో తక్కువ స్కోరు సాధించినట్లు నివేదిక చెబుతోంది.ఈ పిల్లలు ప్రస్తుతం సంక్షోభ స్థితిలో ఉన్నందున పాఠశాలపై దృష్టి పెట్టేంత సౌకర్యం లేదు.

అందువల్ల వీరు చదువులో తరచు వెనుకబడిపోతారని నేషనల్ యూత్ ఫోరం ఆన్ హోమ్‌లెస్‌నెస్ ప్రతినిధి అమండా క్లిఫోర్డ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Telugu Decade, Homeless, Telugu Nri Ups-

2004-05 నుంచి 2017-18 మధ్య 6,80,000 మంది నిరాశ్రయులైన విద్యార్ధులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు.పెరుగుతున్న అద్దెలు, గృహ కొరత కారణంగా కాలిఫోర్నియాలోని వేలాది మంది ప్రజలు నిరాశ్రయులుగా మారుతున్నారు.తక్కువ ధరలకు ఎక్కువ ఇళ్లను అందించడం, అలాగే గాయం, వ్యసనం బారిన పడిన కుటుంబాలకు సాయాన్ని అందించడం వల్ల ఈ సంక్షోభాన్ని నివారించవచ్చని.

ఈ కుటుంబాల యొక్క తక్షణ అవసరాలను తీర్చడం చాలా ముఖ్యమని క్లిఫోర్డ్ చెప్పారు.ఉదాహరణకు ఇంటి అద్దె, కారు మరమ్మత్తులు చెల్లించం వంటి సాయాలను చేయాలన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube