ఆ అమ్మాయి రోజు రైల్వే స్టేషన్ కి వెళ్లి చదువుకుంటుంది..! ఎందుకో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.!  

  • దేని పైన అయినా మనకు ఇష్టం ఉంటే దానిని పొందేందుకు ఎంత కష్టమైనా పడుతుంటాం. ఇష్టమైనదాని కోసం ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తుంటాం. మన మాజీ రాష్ట్రపతి డా. ఏ.పి.జె అబ్దుల్ కలాం చెప్పినట్టు ‘ నీవు సూర్యునిలా వెలగాలంటే ముందు సూర్యునిలా మండాలి అని’.

  • మీకు ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు దివ్య. తాను ఎక్కడ ఉందొ మీరు గుర్తు పట్టే ఉంటారు. అవును తాను ఉన్నది రైల్వే స్టేషన్ లో. అక్కడ ఎలాంటి పని చేయడం లేదు కేవలం చదువుకుంటుంది ఈ అమ్మాయి. దివ్య ప్రతి రోజు సాయంత్రం స్కూల్ నుండి రాగానే సరాసరి రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడే హోమ్ వర్క్ పూర్తీ చేసుకొని తర్వాత కొద్ది సమయం చదువుకొని వెలుతుంది.

  • Homeless Little Girl Every Day Comes To The Railway Station Study-Homeless Madya Pradesh Orai Study

    Homeless Little Girl Every Day Comes To The Railway Station To Study

  • దివ్య ది ఉత్తరప్రదేశ్ లోని ఓరై పట్టణంలోని రైల్వేస్టేషన్ పక్కన గుడి సమీపంలో ఉండే చిన్న గుడిసె. దివ్య ఇంట్లో కరెంట్ సౌకర్యం లేదు అందుకే ప్రతి రోజు దగ్గరిలోనో రైల్వే స్టేషన్ కి వెళ్లి అక్కడ ఒక లైట్ కింద కూర్చొని హోమ్ వర్క్ చేసుకుంటూ లేదా చదువుకుంటూ ఉంటుంది.

  • Homeless Little Girl Every Day Comes To The Railway Station Study-Homeless Madya Pradesh Orai Study
  • చూశారా! మనకు అన్ని ఉన్నా చదవడం అంటేనే పెద్ద చిరాకు. కానీ ఎలాంటి సౌకర్యాలు లేని వారికి చదువుపై ఎంత ప్రేమ ఉంటుందో చూడండి. మన చుట్టూ కూడా చాలా మంది ఇలా ఉంటారు కానీ మనం వారిని పట్టించుకోము ఎందుకంటే వారి దగ్గరికి వెళ్లి మాట్లాడితే మన పరువుపోతుంది అనుకుంటారు చాలా మంది. కానీ ఒక్కసారి వారితో మాట్లాడి చూడండి మిమ్మలి వారి తెలివితో ఆశ్చర్యపరుస్తారు.