బియ్యం పురుగు పట్టకుండా ఉండటానికి అద్భుతమైన చిట్కాలు

ఎంతో ఖర్చు చేసి తెచ్చిన బియ్యం కొన్ని రోజులకే పురుగు పట్టిందంటే చాలా బాధ కలుగుతుంది.అలాగే ఆ బియ్యాన్ని వాడాలంటే చాలా కష్టంగా ఉంటుంది.

 Home Tips To Prevent Worms,insects From Stored Rice-TeluguStop.com

అలాగే ఆ బియ్యాన్ని శుభ్రం చేయాలన్నా చాలా కష్టం.అందుకే ఇప్పుడు బియ్యం పురుగు పట్టకుండా ఉండటానికి కొన్ని చిట్కాలను తెలుసుకుందాం

కర్పూరం<

Br/>ఘాటైన వాసనతో ఉండే కర్పూరం బియ్యంలో పురుగు పట్టకుండా చేస్తుంది.కర్పూరం బిళ్లలను పొడి చేసుకొని మందపాటి వస్త్రంలో మూట కట్టి వేయాలి.

వేపాకులు


బియ్యాన్ని తెచ్చిన వెంటనే బియ్యంలో వేపాకులు వేస్తె పురుగు పట్టదు.వేపాకు లో ఉండే క్రిమి సంహారక లక్షణాలు బియ్యం పురుగు పట్టకుండా చేస్తాయి.బియ్యంలో నేరుగా వేపాకులు వేయవచ్చు.లేదా వేపాకులను ఎండలో ఎండ బెట్టి పొడి చేసి ఒక వస్త్రంలో మూట కట్టి బియ్యంలో వేయవచ్చు .ఈ విధముగ చేయటం వలన బియ్యంలో తెల్ల పురుగులు మరియు ముక్కు పురుగులు కూడా చేరవు.

వెల్లుల్లి రెబ్బలు


బియ్యంలో కొన్ని వెల్లుల్లి రెబ్బలను పొట్టు తియ్యకుండా వేస్తె బియ్యానికి పురుగు పట్టదు.అలాగే వెల్లుల్లి రెబ్బలను పల్చటి కాటన్ వస్త్రంలో మూటకట్టి కూడా వేయవచ్చు.

కాకరకాయ


బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఎండిన కాకరకాయ ముక్కలను పలుచని వస్త్రంలో వేసి మూట కట్టి బియ్యంలో వేయాలి.

లవంగాలు


లవంగాలు బియ్యం పురుగు పట్టకుండా ఉండటానికి మంచి రెమిడీ అని చెప్పవచ్చు.బియ్యంలో లవంగాలను లేదా లవంగాల పొడిని పల్చటి కాటన్ వస్త్రంలో మూట కట్టి వేస్తె బియ్యం పురుగు పట్టవు.

ఆముదం


బియ్యానికి కొంచెం ఆముదాన్ని రాస్తే పురుగు పట్టదు.అలాగే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube