మొటిమలు మోసుకొచ్చే రంధ్రాలు పోవాలంటే ఇలా చేయండి

మోటిమలతో ఇబ్బందిపడే వారి బాధ అంతాఇంతా కాదు.అన్నికన్నా ముందు మొటమలతో బాధపడాలి, ఆ తరువాత మచ్చలు, ఆ తరువాత వాటివలన ఏర్పడే గుంటలు, రంధ్రాలు.

 Home Remidies To Treat Acne Scars-TeluguStop.com

ముఖ సౌందర్యాన్నీ పూర్తిగా దెబ్బతీస్తాయి మొటిమలు, వాటి వలన ఏర్పడే గుంటలు.ఈ గుంటని, రంధ్రాల్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంట్లోనే ఉపాయాలు ఉన్నాయి.

* గంధం, పసుపు సమానంగా తీసుకోండి.ఆల్మండ్ ఆయిల్ ఈ మిశ్రమంలో కలిపి ముఖానికి పట్టండి.

ఈ ఫేస్ ప్యాక్ ని కనీసం 20 నిమిషాలపాటు ఉంచి ఆ తరువాత కడిగేయ్యండి.ఇలా రోజూ చెయండి

* ఐస్ క్యూబ్ తో ప్రతీరోజు రెండు మూడు సార్లు ఫేస్ మసాజ్ చేయండి.

ఐస్ క్యుబ్ మాసాజ్ వలన ముఖనికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది.గుంటలు, రంధ్రాలను త్వరగా కప్పివేయవచ్చు

* రోజ్ వాటర్, కుకుంబర్ జ్యూస్ తో ఓ మిశ్రమాన్ని తయారుచేసుకోని రోజూ ముఖానికి పట్టండి.

కాటన్ తో ముఖంపై ఈ మిశ్రమాన్ని రుద్దితే మంచిది.ఓ అరగంటసేపు అలాగే ఉంచి ఆ తరువాత కడిగేసుకోవాలి

* బాదం గింజలు, నిమ్మరసంతో ఓ మిశ్రమాన్ని చేసుకోని ముఖానికి పట్టండి.

ఓ 20 నిమిషాలపాటు ఈ ఫేస్ ప్యాక్ ని అలాగే ఉంచి కడిగేసుకుంటే మంచిది

* జొడ్డు చర్మం బాధితులు, ఒక ఎగ్ వైట్ ని తీసుకొని, రెండు అస్పిరిన్ ట్యాబ్లెట్లు, పెరుగు కలిపి బాగా మిక్స్ చేసుకోని రోజు ఓ 20 నిమిషాలపాటు ముఖానికి పట్టాలి

* తేనే చర్మాన్ని ఎన్నోవిధాలుగా కాపాడుతుంది.దీనిలో ఉండే యాంటి బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్, పొటాషియం, మొటిమలు, వాటి గుర్తులతో పోరాడతాయి.

రోజూ తేనేతో ఓ 15-20 నిమిషాలపాటు మసాజ్ చేయండి.ఇలా క్రమం తప్పకుండా చేస్తే, అందమైన ముఖం ఎంతో దూరంలో లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube