అల్లం, నిమ్మరసంతో బెల్లి ఫ్యాట్ కు చెక్ !

వర్షాకాలం వస్తే ఎండల తీవ్రత నుంచీ ఉపశమనం పొందడానికి వీలవుతుంది.అయితే వానాకాలం వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.

 Ginger And Lemon Juice, Healthy Tips, Home Remedies, Belly Fat Tips-TeluguStop.com

అందుకే సీజన్‌కి తగ్గట్టు మనం తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చేసుకోవాలని నిపుణులు తెలిపారు.మనం తీసుకునే ఆహారంలో ఆహారంలో పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పుల వంటివి ఉండేలా చేసుకోవాలి.

ఇలా తీసుకోవడం వలన మనకు దగ్గు, జ్వరాల నుంచీ దూరం చేయడమే కాదు. అధిక బరువు తగ్గేందుకు కూడా ఉపయోగపడతాయి.అందువల్ల వర్షాకాలంలో బరువు తగ్గేందుకు ఎక్కువ అవకాశాలుంటాయని తెలిపారు.ఇది బరువు తగ్గడానికి మనం ఏదేదో చేసేయాల్సిన అవసరం లేదు.

అవర్ గ్లాస్ బాడీ కోసం అదే పనిగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు.ప్రకృతి సహజ సిద్ధంగానే మనకు ప్రయోజనాలు కలిగిస్తాయి.

అయితే ఇంట్లో ఉండే నిమ్మకాయ, అల్లం ద్వారా తయారయ్యే డ్రింక్‌తో పొట్టచుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవచ్చు.అది కూడా జస్ట్ ఐదు రోజుల్లో మాత్రమే.ఆహార నియమాలు అవసరం లేదన్నారు.అదే పనిగా వర్కవుట్ కూడా చెయ్యాల్సిన పనిలేదని తెలిపారు.

Telugu Belly Fat Tips, Ginger Lemon, Healthy Tips, Tips-

అల్లంలో జింజెరోల్స్, షోగౌల్స్ ఉంటాయి.ఇవి శరీరంలో మంటలు తగ్గిస్తాయి.జీర్ణ ప్రక్రియను క్రమబద్ధీకరిస్తాయి.ఈ చర్యల వల్ల బరువు తగ్గుతారని తెలిపారు.నిమ్మరసంలో విటమిన్ సీ ఉంటుంది.ఇది కూడా ఆకలి తగ్గిపోయేలా చేస్తుంది.

అందువల్ల చాలా మంది బరువు తగ్గేందుకు నిమ్మ, అల్లంతో తయారయ్యే డ్రింక్ తాగుతున్నారు.

అయితే నిమ్మకాయ తీసుకొని దాని రసాన్ని ఓ గిన్నెలో రసం తీసుకోవాలి.

తాజా అల్లం ముక్క తీసుకొని, తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి, గిన్నెలో వెయ్యండి.ఇప్పుడు గిన్నెలో మూడు కప్పుల నీరు కలపాలి.నీటిలో ఉన్న నిమ్మరసం, అల్లం ముక్కలను 5 నుంచీ 10 నిమిషాలు ఉడికించాలి.బుడగలు వచ్చేటప్పుడు దింపి వడగట్టాలి.

మూడు కప్పుల డ్రింక్ రెడీ.దీన్ని టీలాగా వేడిగా తాగొచ్చు, ప్రిజ్‌లో పెట్టుకొని కూల్‌గా తాగొచ్చు.

రుచి కోసం కావాలంటే తేనె వేసుకోవచ్చు.రోజుకు మూడు కప్పులు, మూడు పూట్లా తాగితే ఐదు రోజుల్లో కొవ్వు కరిగినట్లు మీకే అనిపిస్తుంది.

త్వరగా కొవ్వు కరగకూడదనుకుంటే రోజుకు ఒక కప్పే తాగితే సరిపోతుందని నిపుణులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube