కళ్ళజోడు మార్కులను(మచ్చలను) తొలగించటానికి ఇంటి చిట్కాలు

కళ్ళజోడు పెట్టుకోవటం స్టైల్ గా ఉన్న సరే ముక్కు మీద మార్క్స్ పడతాయి.ప్రతి రోజు క్రమం తప్పకుండా కళ్ళజోడు వాడే వారి ముక్కు చర్మం మీద పిగ్మెంటేషన్ మార్కులు వస్తాయి.

 Home Remedies To Remove Spectacle Marks On Nose-TeluguStop.com

అంతేకాక మనలో చాలా మంది కళ్ళజోడుకు ప్రత్యమ్నాయంగా కాంటాక్ట్ లెన్స్ వాడటానికి ఇష్టపడటం లేదు.అయితే కొన్ని ఇంటి నివారణల ద్వారా సహజ మార్గంలో ఈ మార్కులను తగ్గించుకోవచ్చు.

1.దోసకాయ

దోసకాయ ముక్కలు పిగ్మెంటేషన్ సమస్యను తగ్గించటం మరియు కళ్ళజోడు మార్కులను తగ్గించటంలో సహాయపడతాయి.ఈ మార్కులపై దోసకాయ రసాన్ని రాయవచ్చు లేదా దోసకాయ ముక్కలను పెట్టవచ్చు.

2.తేనే

ఈ సమస్యను సమర్ధవంతంగా పరిష్కరించటంలో తేనే సహాయపడుతుంది.నల్లని మార్కులపై తేనెను రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి.ప్రతి రోజు క్రమం తప్పకుండా కళ్ళజోడు నల్లని మార్కులపై రాస్తూ ఉంటే క్రమంగా తగ్గిపోతాయి.

3.కలబంద

కలబంద జెల్ నల్లని మార్కులను తొలగించటానికి ఒక మంచి మార్గం.కలబందలో అద్భుతమైన నయం చేసే లక్షణాలు ఉండుట వలన కళ్ళజోడు మార్కులను సమర్ధవంతంగా తొలగిస్తుంది.కలబంద జెల్ ని ప్రభావిత ప్రాంతంలో రాసి 15 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

4.నిమ్మకాయ

నిమ్మకాయలో సహజ బ్లీచింగ్ లక్షణాలు ఉండుట వలన కళ్ళజోడు మచ్చలను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.ఒక బౌల్ లో రెండు స్పూన్ల నిమ్మరసం,ఒక స్పూన్ నీరు వేసి బాగా కలపాలి.

ఈ మిశ్రమంలో కాటన్ బాల్ ముంచి ప్రభావిత ప్రాంతంలో రాయాలి.ఈ విధంగా చేయుట వలన చర్మం పిగ్మెంటేషన్ సమస్యలు మరియు కళ్ళజోడు మచ్చలను తగ్గిస్తుంది.నిమ్మరసంలో తేనెను కూడా కలపవచ్చు.

5.బంగాళదుంప

బంగాళదుంపలో కూడా బ్లీచింగ్ కాంపౌండ్స్ ఉన్నాయి.అందువలన కళ్ళజోడు నల్లని మచ్చలను తొలగించటంలో సహాయపడుతుంది.

బంగాళదుంప రసాన్ని ప్రభావిత ప్రాంతంలో రాయవచ్చు.లేదా బంగాళదుంప ముక్కను ప్రభావిత ప్రాంతంలో రుద్దవచ్చు.ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే మంచి పలితం కనపడుతుంది.

—————

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube