కంటి కింద నల్లటి వలయాలకు చెక్ పెట్టాలంటే.... సులభమైన చిట్కా  

Home Remedies To Remove Dark Circles Naturally-

మారుతున్న జీవనశైలి కారణంగా ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతఒక్కరికి కంటి కింద నల్లని వలయాలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా ఈ నల్లటవలయాలు కనపడగానే మార్కెట్ కి వెళ్లి ఏదో క్రీమ్ తెచ్చేసి రాసేస్తూ ఉంటాంకానీ ఆ విధంగా చేయటం చాల తప్పు. మనకు ఇంటిలో అందుబాటులో ఉండే కొన్నవస్తువుల ద్వారా ఈ నల్లటి వలయాలను తగ్గించుకోవచ్చు..

కంటి కింద నల్లటి వలయాలకు చెక్ పెట్టాలంటే.... సులభమైన చిట్కా-

పుదీనా ఆకులను పేస్ట్ గా చేసి కంటి చుట్టూ ప్యాక్ వేయాలి. ఆరిన తర్వాచల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.కంటి కింద నల్లటి వలయాలను తగ్గించటంలో టమోటా చాల సమర్ధవంతంగపనిచేస్తుంది.

ఒక టమోటా పేస్టులో ఒక స్పూన్ నిమ్మ రసం,చిటికెడపసుపు,చిటికెడు శనగపిండి కలపాలి. ఈ మిశ్రమాన్ని కంటి చుట్టూ రాసి అరగంతర్వాత శుభ్రం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితకనపడుతుంది.రోజ్ వాటర్ లో కాటన్ బాల్ ముంచి కంటి మీద పెట్టుకొని పది నిమిషాల తర్వాతీసేసి చల్లని నీటితో కడిగితే కంటి చుట్టూ చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

ప్రతి రోజు రాత్రి పడుకొనే ముందు కంటి చుట్టూ బాదం ఆయిల్ లేదా బాదాక్రీమ్ రాసి సున్నితంగా మసాజ్ చేసే మంచి ఫలితం ఉంటుంది.గ్లిజరిన్,ఆరెంజ్ జ్యుస్ సమపాళ్లలో తీసుకోని బాగా కలిపి కంటి చుట్టరాయాలి. ఈ విధంగా ప్రతి రోజు చేస్తూ ఉంటే నిదానంగా నల్లటి వలయాలతగ్గుముఖం పడతాయి.

ఈ ఇంటి నివారణ చాలా బాగా పనిచేస్తుంది.నిమ్మరసం,టమోటా రసం సమపాళ్లలో తీసుకోని బాగా కలిపి కంటి చుట్టూ రాసి ఆరితర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.బంగాళాదుంప రసాన్ని తీసి కంటి చుట్టూ రాసి ఆరిన తర్వాత చల్లని నీటితశుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.