చేతి గోర్లు పొడ‌వుగా పెర‌గాలా.. అయితే ఈ టిప్స్ మీకోస‌మే!

సాధార‌ణంగా చేతి గోర్లు పొడ‌వుగా ఉంటే అందంగా ఉంటాయ‌ని చాలా మంది భావిస్తుంటారు.అది అక్ష‌రాలా నిజం.

గోర్లు పొడ‌వుగా ఉంటే చేతి వేళ్లు అందంగా క‌నిపిస్తాయి.అందుకే గోర్లు పెంచుకునేంద‌కు ఆస‌క్తి చూపుతుంటారు.

ముఖ్యంగా అమ్మాయిలు ఈ విష‌యంలో అస్స‌లు రాజీప‌డ‌రు.ఈ క్ర‌మంలోనే గోర్లు పెంచుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

అయితే కొంద‌రి గోర్లు మాత్రం ఎంత కేరింగ్‌గా చూసుకున్నా.పెలుసుగా మారి విరిగి పోతుంటాయి.

Advertisement

అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ ఫాలో అయితే.మీ గోర్లు పొడ‌వుగా, అందంగా పెరుగుతాయి.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా కొబ్బ‌రి నూనె మ‌రియు నిమ్మ‌ర‌సం క‌లుపుకోవాలి.ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని స్ట‌వ్‌పై ఒక నిమిషం పాటు హీట్ చేయాలి.

ఇప్పుడు దీనిని గోర్ల‌కు అప్లై చేసి.బాగా మ‌సాజ్ చేసుకోవాలి.

ఇలా రోజుకు రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల గోర్లు విర‌గ‌డం త‌గ్గి.బ‌లంగా పెర‌గ‌డం మొద‌లు పెడ‌తాయి.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

అలాగే వెల్లుల్లి కూడా గోర్లు పొడ‌వుగా పెర‌గ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.ముందుగా కొన్ని వెల్లుల్లి రెబ్బ‌ల‌ను తీసుకుని మొత్త‌గా పేస్ట్ చేసి.

Advertisement

ర‌సం తీసుకోవాలి.ఇప్పుడు ఈ రసాన్ని గోర్లుకు అప్లై చేసి వ‌దిలేయాలి.

ఇలా ప్ర‌తి రోజు రాత్రి నిద్రించే ముందు చేస్తే.గోర్లు అందంగా మ‌రియు వేగంగా పెరుగుతాయి.

ఇక వెల్లుల్లి ర‌సం బ‌దులుగా ప‌డుకునే ముందు గోర్ల‌కు ఆలివ్ ఆయిల్ కూడా రాసుకోవచ్చు.ఇలా చేసినా గోర్లు పెరుగుతాయి.

గోర్ల‌ను పొడ‌వుగా పెంచ‌డంలో గ్రీన్ టీ కూడా గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.ప్ర‌తి రోజు గోర్ల‌కు గ్రీన్ టీను అప్లై చేస్తూ ఉండాలి.

ఇలా చేయడం వ‌ల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గోర్ల ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంతో పాటు.పొడ‌వుగా ఎదిగేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి.

అయితే గోర్లు పొడ‌వుగా పెరగాలంటే పైన చెప్పిన విధంగా చేయ‌డ‌మే కాదు.ఎక్కువగా గోర్ల‌ను నీటిలో నాన‌కుండా చూసుకోవాలి.

నీటిలో గోర్లు నానితే.త్వ‌ర‌గా విరిగిపోతాయి.

తాజా వార్తలు