పెదవులపై తెల్లని మచ్చలను తొలగించటానికి అద్భుతమైన ఇంటి చిట్కాలు  

కొంతమంది పెదవులపై తెల్లని మచ్చలు ఉంటాయి.ఇవి హాని చేయకపోయినా కొంచెం అసహ్యంగా కన్పిస్తాయి.చర్మంలో సెబమ్ ఉత్పత్తి ఎక్కువగా ఉన్నపుడు ఇలా తెల్లని మచ్చలు వస్తూ ఉంటాయి.ఈ తెల్లని మచ్చలను తొలగించుకోవడానికి ఎటువంటి కాస్మొటిక్స్ జోలికి వెళ్లనవసరం లేదు.

కొన్ని ఇంటి చిట్కాల ద్వారా సులభంగా తొలగించుకోవచ్చు.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

-

వెల్లుల్లి పేస్ట్ లో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి పెదవులపై రాయాలి.పది నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఇలా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.వెల్లుల్లిలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇన్ ఫెక్షన్ కి కారణం అయినా బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి.

ఒక స్పూన్ ఆపిల్ సిడార్ వెనిగర్ లో ఒక స్పూన్ నీటిని కలపాలి.ఈ మిశ్రమంలో కాటన్ బాల్ ని ముంచి పెదవులపై అద్దాలి.

పది నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే ఆపిల్ సిడార్ వెనిగర్ లో ఉండే ఎసిడిక్ స్వభావం తెల్లని మచ్చలను తొలగిస్తుంది.

మజ్జిగలో కాటన్ బాల్ ముంచి పెదవులపై రాసి పది నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే తెల్లని మచ్చలు తొలగిపోతాయి.

తాజా వార్తలు