పులిపిర్లు ఒక్క రోజులో రాలిపోయే అధ్బుత చిట్కా మీ ఇంట్లోనే...     2017-10-29   21:55:47  IST  Lakshmi P

సాధారణంగా పులిపిర్లు మన చేతులు, కాళ్ళు, ముఖంపైన ఎక్కువగా కనబడతాయి. వీటి వాళ్ళ ఎటువంటి నొప్పి లేకపోయినా చాలా అసహ్యంగా కనిపిస్తాయి. వీటికి కారణం వైరస్ అని కొంత మంది నిపుణులు అంటున్నారు. ఇవి ఎక్కువగా గోధుమ రంగులో కనిపిస్తాయి. వీటిని తియ్యడానికి గోర్లను ఉపయోగించకూడదు. వీటిని నివారించటానికి అద్భుతమైన చిట్కాలను తెలుసుకుందాం.

అరటి తొక్కను చిన్న ముక్కగా కట్ చేసి పులిరిపై అతికించాలి. ఆలా అతికించిన అరటి తొక్క పోకుండా ఉండటానికి దానిపై ప్లాస్టర్ వేసి అతికించాలి. ఈ విధంగా రాత్రంతా ఉంచి మరుసటి రోజు తీసివేయాలి.

విటమిన్ ‘C’సమృద్ధిగా ఉండే ఉసిరి గుజ్జును రాయడం వలన పులిపిరి రాలిపోతుంది.


వెల్లుల్లి రసాన్ని కూడా పులిపిరిని నివారించడానికి ఉపయోగించవచ్చు. వెల్లుల్లి రసాన్ని పులిపిరి మీద రోజులో నాలుగు రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

బొప్పాయి పాలు కూడా పులిపిరి నివారణకై వాడవచ్చు. బొప్పాయి పాలను రోజులో మూడు సార్లు రాస్తే మంచి ఫలితం ఉంటుంది.

అల్లం ముక్కను సున్నంలో తడిపి పులిపిరిపై పెట్టాలి. కానీ, సున్నం వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.

ఐయోడిన్ పులిపిరి నివారణకు బాగా సహాయాపడుతుంది. అయితే ఐయోడిన్ అప్లై చేసేప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అయోడిన్ లిక్విడ్ లో ఇయర్ బడ్ డిప్ చేసి పులిపుర్ల్ మీద మాత్రమే అప్లై చేయాలి.

ఆముదాన్ని పులిపిర్లపైనా రాస్తే ఫలితం ఉంటుంది. ఇలా తరచు చేయడం వల్ల పులిపిర్లు రాలిపోతాయి.