పై పెదవిపై అవాంఛిత రోమాలు..
చాలా మంది అమ్మాయిలు ఈ సమస్యతో తెగ ఇబ్బంది పడుతుంటారు.ముఖం ఎంత తెల్లగా, అందంగా ఉన్నా.
పై పెదవిపై అవాంఛిత రోమాలు ఉంటే మాత్రం అందహీనంగా కనిపిస్తారు.అందకే వాటిని తొలిగించుకునేందుకు తరచూ బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతుంటారు కొందరు.
అయితే ఇంట్లోనే కొన్ని కొన్ని న్యాచురల్ టిప్స్ ఫాలో అయితే.చాలా సులువుగా పై పెదవిపై ఉన్న అవాంఛిత రోమాలను తొలిగించుకోవచ్చు.
మరి ఆ టిప్స్ ఏంటో ఓ లుక్కేసేయండి.
పై పెదవిపై అవాంఛిత రోమాలను తొలగించడంతో పచ్చి బొప్పాయి అద్భుతంగా సహాయపడుతుంది.
పచ్చి బొప్పాయి పేస్ట్‌ను ఒక బౌల్లో వేసుకుని అందులో చిటికెడు పసుపు, కలబంద గుజ్జు మరియు శెనగపిండి వేసి బాగా మిక్స్ చేసుకుని.పెదవిపై అప్లై చేయాలి.
బాగా ఆరిన తర్వాత మెల్లగా నలుపుకుంటూ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే ఆవాంఛిత రోమాలు తొలిగిపోవడమే కాదు.
మళ్లీ పెరగకుండా కూడా ఉంటాయి.
అలాగే రెండొవది.
బంగాళాదుంపల నుంచి రసం తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి.ఇప్పుడు ఆ రసంలో కొద్దిగా పెసరపిండి వేసి మిక్స్ చేసి పై పెదవిపై అప్లై చేయాలి.
ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు వదిలేయాలి.ఎండిన తరువాత బాగా రుద్ది కోల్డ్ వాటర్‌తో కడిగేయాలి.
ఇలా మూడు రోజులకు ఒకసారి చేస్తే అవాంఛిత రోమాలు క్రమంగా తొలగిపోతాయి.
ఇక మూడొవది.
ఒక బౌల్లో బాగా పండిన అరటి పండు గుజ్జు, బియ్యం పిండి మరియు తేనె వేసి కలుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పై పెదవి పై అప్లై చేసి.
అర గంట పాటు ఆరనివ్వాలి.బాగా ఆరిన తర్వాత మెల్ల మెల్లగా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి.
ఇలా తరచూ చేసినా పై పెదవి పై అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.