పై పెదవిపై అవాంఛిత రోమాలను తొల‌గించే ఎఫెక్టివ్ టిప్స్ మీకోసం!

పై పెదవిపై అవాంఛిత రోమాలు..

 Home Remedies To Get Rid Of Unwanted Hair On Upper Lip-TeluguStop.com

చాలా మంది అమ్మాయిలు ఈ స‌మ‌స్య‌తో తెగ ఇబ్బంది ప‌డుతుంటారు.ముఖం ఎంత తెల్ల‌గా, అందంగా ఉన్నా.

పై పెద‌విపై అవాంఛిత రోమాలు ఉంటే మాత్రం అంద‌హీనంగా క‌నిపిస్తారు.అంద‌కే వాటిని తొలిగించుకునేందుకు త‌ర‌చూ బ్యూటీ పార్ల‌ర్స్ చుట్టూ తిరుగుతుంటారు కొంద‌రు.

 Home Remedies To Get Rid Of Unwanted Hair On Upper Lip-పై పెదవిపై అవాంఛిత రోమాలను తొల‌గించే ఎఫెక్టివ్ టిప్స్ మీకోసం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇంట్లోనే కొన్ని కొన్ని న్యాచుర‌ల్ టిప్స్ ఫాలో అయితే.చాలా సులువుగా పై పెదవిపై ఉన్న అవాంఛిత రోమాలను తొలిగించుకోవ‌చ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో ఓ లుక్కేసేయండి.

పై పెదవిపై అవాంఛిత రోమాలను తొల‌గించ‌డంతో పచ్చి బొప్పాయి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ప‌చ్చి బొప్పాయి పేస్ట్‌ను ఒక బౌల్‌లో వేసుకుని అందులో చిటికెడు ప‌సుపు, క‌ల‌బంద గుజ్జు మ‌రియు శెన‌గ‌పిండి వేసి బాగా మిక్స్ చేసుకుని.పెద‌విపై అప్లై చేయాలి.

బాగా ఆరిన త‌ర్వాత మెల్ల‌గా న‌లుపుకుంటూ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేస్తే ఆవాంఛిత రోమాలు తొలిగిపోవ‌డ‌మే కాదు.

మ‌ళ్లీ పెర‌గ‌కుండా కూడా ఉంటాయి.

అలాగే రెండొవ‌ది.

బంగాళాదుంపల నుంచి రసం తీసుకుని ఒక బౌల్‌లో వేసుకోవాలి.ఇప్పుడు ఆ ర‌సంలో కొద్దిగా పెస‌ర‌పిండి వేసి మిక్స్ చేసి పై పెదవిపై అప్లై చేయాలి.

ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు వ‌దిలేయాలి.ఎండిన తరువాత బాగా రుద్ది కోల్డ్ వాట‌ర్‌తో కడిగేయాలి.

ఇలా మూడు రోజుల‌కు ఒక‌సారి చేస్తే అవాంఛిత రోమాలు క్ర‌మంగా తొల‌గిపోతాయి.

ఇక మూడొవ‌ది.

ఒక బౌల్‌లో బాగా పండిన అర‌టి పండు గుజ్జు, బియ్యం పిండి మ‌రియు తేనె వేసి క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని పై పెద‌వి పై అప్లై చేసి.

అర గంట పాటు ఆర‌నివ్వాలి.బాగా ఆరిన త‌ర్వాత మెల్ల మెల్ల‌గా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేసినా పై పెద‌వి పై అవాంఛిత రోమాలు తొల‌గిపోతాయి.

#UnwantedHair #Home Remedies #Beauty Tips #Upper Lip #Unwanted Hair

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు