వ‌ర్షాల్లో త‌డిచారా? స్కిన్‌పై ర్యాషెస్ వ‌చ్చాయా? అయితే ఈ టిప్స్ మీకే!

వేస‌వి కాలంలో పోయి.వ‌ర్షాకాలం రానే వ‌చ్చింది.

 Home Remedies To Get Rid Of Skin Rashes In Rainy Season! Skin Rashes, Rainy Seas-TeluguStop.com

ఈ సీజ‌న్‌లో అంద‌రూ వ‌ర్షంలో త‌డిచేందుకు మ‌హా స‌ర‌దా ప‌డుతుంటారు.అందులోనూ అమ్మాయిలు మ‌రియు చిన్న పిల్లలైతే అస్స‌లు ఆగ‌రు.

కానీ, వ‌ర్షంలో త‌డ‌వ‌టం వ‌ల్ల కొంద‌రికి ఒక్కోసారి చ‌ర్మంపై ర్యాషెస్ వ‌స్తుంటాయి.ఈ నేప‌థ్యంలోనే వాటిని చూసి తెగ కంగారు ప‌డిపోతూ ఉంటాయి.

మ‌రియు వాటిని ఎలా త‌గ్గించుకోవాలో అర్థం గాక ఇబ్బంది ప‌డుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే.

సుల‌భంగా స్కిన్‌పై ఏర్ప‌డిన ర్యాషెస్‌ను నివారించుకోవ‌చ్చు.మ‌రి ఆల‌స్యం చేయ‌కుండా ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

కీర‌దోస స్కిన్ ర్యాషెస్‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.పీల్ తీసిన కీర‌దోస ముక్క‌ల‌ను మెత్తగా పేస్ట్ చేసి.ర‌సం తీసుకోవాలి.ఇప్పుడు ఈ ర‌సాన్ని ర్యాషెస్ ఉన్న చోట పూసి.

ఇర‌వై నిమిషాల అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే.

ర్యాషెస్ క్ర‌మంగా త‌గ్గిపోతాయి.

Telugu Cucumber, Green Tea, Latest, Oats Powder, Rainy Season, Skin Care, Skin C

అలాగే ఒక బౌల్‌లో ఓట్స్ పొడి, కొద్దిగా ప‌సుపు మ‌రియు నీరు పోసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ర్యాషెస్ ఏర్ప‌డిన చోట అప్లై చేసి.డ్రై అయిన త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేస్తే.ఓట్స్ మ‌రియు ప‌సుపులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కారణంగా చర్మంపై వ‌చ్చిన ర్యాషెస్‌తో పాటు మంట, దుర‌ద కూడా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.

Telugu Cucumber, Green Tea, Latest, Oats Powder, Rainy Season, Skin Care, Skin C

ఇక సాధార‌ణంగా చాలా మంది వెయిట్ లాస్ అవ్వ‌డానికి గ్రీన్ టీ సేవిస్తుంటారు.అయితే ర్యాషెస్‌ను నివారించడంలోనూ గ్రీన్ టీ యూజ్ అవుతుంది.గ్రీన్ టీను కాచి.చ‌ల్లారిన త‌ర్వాత దూది సాయంతో చ‌ర్మంపై పూసుకోవాలి.ప‌ది నిమిషాల పాటు ఆర‌నిచ్చి.త‌ర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇలా చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube