ముఖం, ముక్కు మీద బ్లాక్స్ హెడ్స్ ను మాయం చేసే ఉప్పు చిట్కాలు   Home Remedies To Get Rid Of Blackheads Fast     2017-11-09   22:48:30  IST  Lakshmi P

మన అందాన్ని మన ముఖం ప్రతిబింబిస్తుంది. అలాగే మన ముఖం వల్ల వయస్సు, అందం తెలుస్తుంది. అయితే మనం నిత్యం కాలుష్యంతో తిరగడం వల్ల మనకు ముక్కు మీద బ్లాక్ హెడ్స్.. అంటే ముక్కు మీద మురికితో కూడిన మచ్చలు మన ముఖం అందాన్ని పూర్తిగా పాడుచేస్తాయి. బ్లాక్ హెడ్స్ ను నివారించడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఇవి బ్లాక్ హెడ్స్ ను నివారించడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా చేస్తాయి.

రోజ్ వాటర్ మరియు ఉప్పు
ఒక బౌల్ లో ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే బ్లాక్ హెడ్స్ సమస్య తొలగిపోతుంది.

పంచదార మరియు ఉప్పు
ఒక బౌల్ లో ఒక స్పూన్ ఉప్పు,ఒక స్పూన్ పంచదార,కొద్దిగా రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. 15నిముషాల తర్వాత తడి వస్త్రంతో తుడిస్తే ముక్కు మీద బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.


తేనే మరియు ఉప్పు
ఒక స్పూన్ తేనెలో రెండు స్పూన్ల ఉప్పును వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి సున్నితంగా మసాజ్ చేయాలి. 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తుంటే ముఖం మీద బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.

శనగపిండి మరియు ఉప్పు
ఒక బౌల్ లో ఒక స్పూన్ శెనగపిండి, ఒక స్పూన్ ఉప్పు మరియు ఒక స్పూన్ పాలను బాగా కలిపి ముఖానికి పట్టించి 15 నిముషాల తర్వాత తొలగించడం వల్ల చర్మంలోని బ్లాక్ హెడ్స్ తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.

పెరుగు మరియు ఉప్పు
పెరుగులో కొద్దిగా ఉప్పు కలిపి ముఖానికిరాయాలి. 15నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మరియు కాలిన గాయలు మానేలా చేస్తుంది.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.