డెలివరీ తర్వాత స్త్రీలను ప్రధానంగా వేధించే సమస్యల్లో నడుంనొప్పి ఒకటి.ఈ నొప్పి తరచూ రావడమే కాదు చాలా తీవ్రంగా కూడా ఉంటుంది.
ఈ నేపథ్యంలోనే నడుము నొప్పిని నివారించుకునేందుకు పెయిన్ కిల్లర్స్ వాడతారు.కానీ, పిల్లలకు పాలిచ్చే మహిళలు పెయిన్ కిల్లర్స్‌ను ఏ మాత్రం వాడరాదు.
సహజంగానే నొప్పిని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి.అందుకు కొన్ని కొన్ని చిట్కాలు అద్భుతంగా సహాయపడతాయి.
మరి ఆ చిట్కాలు ఏంటో ఆలస్యం చేయకుండా చూసేయండి.
నముడు నొప్పిని నివారించడంలో నువ్వుల నూనె గ్రేట్‌గా సహాయపడుతుంది.
లైట్‌గా వేడి చేసిన నువ్వుల నూనెను నడుముకు అప్లై చేసి కాసేపు మసాజ్ చేయించుకోవాలి.మరియు నువ్వుల నూనెతో తయారు చేసిన వంటలనే తీసుకోవాలి.
తద్వారా ఎముఖలు బలంగా మారతాయి.నొప్పులు దూరం అవుతాయి.
గసగసాలు నడుము నొప్పి తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.కొన్ని గసగసాలను తీసుకుని మెత్తగా పొడి చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటితో అర స్పూన్ గసగసాల పొడి కలిపి సేవించాలి.ఇలా చేస్తే నడుము నొప్పి దరి చేరకుండా ఉంటుంది.
పాలు కూడా బాగా పడతాయి.
బిడ్డ పుట్టిన తర్వాత సరిగ్గా బెడ్ రెస్ట్ తీసుకోకపోయినా నడుము నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది.అందుకే డెలివరీ తర్వాత బెడ్ రెస్ట్ ఎక్కువగా తీసుకోవాలి.దాంతో త్వరగా కోలుకుంటారు.
నడుము నొప్పి నుంచి ఉపశమనాన్ని అందించడంలో వ్యాయామాలు సూపర్‌గా హెల్ప్ చేస్తాయి.ప్రతి రోజు కనీసం ఇరవై నిమిషాలైనా చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుండాలి.
అలాగే పడుకునే సమయంలో మీకు సౌకర్యవంతంగా ఉన్న పొజీషన్ లో నిద్రించాలి.మంచి పొజీషన్‌లో పడుకున్నప్పుడే నడుపు నొప్పి తగ్గు ముఖం పడుతుంది.
ఇక మూడు, నాలుగు స్పూన్ల ఆవ నూనె తీసుకుని అందులో దంచిన రెండు వెల్లుల్లి రెబ్బలను వేసి మరిగించాలి.ఇప్పుడు ఈ నూనెను గోరు వెచ్చగా అయిన తర్వాత నడుము రాసుకుని మసాజ్ చేయించుకోవాలి.
ఇలా చేసినా నడుము నొప్పి తగ్గుతుంది.