మోషన్స్ తో ఇబ్బందిపడుతున్నారా? ఇవిగోండి చిట్కాలు

మోషన్స్ తో ఇబ్బందిపడటం అనేది అతిసాధారణం.కడుపులో ఏమాత్రం తేడా వచ్చినా, మోషన్స్ అవడం జరుగుతూ ఉంటుంది.

 Home Remedies For Loose Motions-TeluguStop.com

మోషన్స్ వలన అలసట, తలనొప్పి, ఒంటినొప్పులు వస్తాయి.మోషన్స్ వలన మన పనులేవి చేసుకోలేం కూడా.

అసలే వర్షాకాలం, మోషన్స్ తో ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుంది ఈ సీజన్ లో.ఈ మోషన్స్ బారినుంచి తప్పించుకునే ఈజీ మార్గాలు తెలుసుకుందాం.

* అరటిపండు లో పెక్టిన్, పొటాషియం,మరియు ఫైబర్ దొరుకుతుంది.మోషన్స్ వస్తే, మూడుపూటలూ మీ డైట్ లో అరటిపండు ఉంచడం మరచిపోకండి.

* ఆపిల్ పండు జ్యూస్ లో తేనె కలుపుకోని తాగండి.ఈ యాంటిబయోటిక్ మిశ్రమం మోషన్స్ కి అడ్డుకట్ట వేస్తుంది.

* దానిమ్మపండు వలన వచ్చే లాభాలు అన్ని ఇన్నీ కావు.ఫంగల్ ఇంఫెక్షన్స్ తో పాటు బ్యాక్టీరియాను పోగొట్టే శక్తి దానిమ్మలో ఉంటుంది.

కాబట్టి మోషన్స్ ని దానిమ్మతో ఎదుర్కోండి.

* అల్లం జీర్ణక్రియకు మంచిది.

నీళ్ళు వేడి చేస్తూ, దాంట్లో అల్లం ముక్క వేయండి.ఆ నీళ్ళు తాగి మోషన్స్ కి చెక్ పెట్టండి.

* పసుపు ముక్కతో కూడా మోషన్స్ ని తరిమేయొచ్చు.గోరవెచ్చని నీళ్ళలో పసుపు కాస్తంత పసుపు వేసి రోజుకి రెండుసార్లు తాగండి.

ఫలితం మీ కళ్ళముందు ఉంటుంది.

* పెరుగుతో తినటం, మజ్జిగ చేసుకోని తాగడం ద్వారా కూడా మోషన్స్ ని కంట్రోల్ లో ఉంచగలం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube