యుక్త వయసు నుంచి మగవారిలో గడ్డాలు, మీసాలు పెరగడం సర్వ సాధారణం.అయితే వీటిని కొందరు స్టైల్‌గా, మరికొందరు పూర్తిగా రేజర్‌తో షేవ్ చేసుకుంటుంటారు.
ఇందుకోసం రకరకాల క్రీములు, ఫోములు కూడా ఉపయోగిస్తుంటారు.అయితే కొందరికి షేవింగ్ తర్వాత చర్మం మంట పుడుతూ ఉంటుంది.
ఇలా మంట పుట్టడం వల్ల చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాయి.ఈ క్రమంలోనే ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ పాటిస్తే.ఈజీగా షేవింగ్ తర్వాత వచ్చే మంటకు చెక్ పెట్టవచ్చు.
మరి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

షేవింగ్ తర్వాత వచ్చే మంటను నివారించడంలో కీర దోస అద్భుతంగా సహాయపడుతుంది.కీర దోసను పీల్ తీసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.ఆ పేస్ట్‌లో పాలు కలిపి మంట పుడుతున్న ప్రాంతంలో అప్లై చేయాలి.
ఇరవే లేదా ముప్పై నిమిషాల పాటు ఆరనిచ్చి.ఆ తర్వాత కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేస్తే మంట నుంచి ఉపవమనం పొందుతారు.
అలాగే తేనె కూడా మంటలను తగ్గించగలదు.
ఒక బౌల్ తీసుకుని.అందులో రెండు స్పూన్ల తేనె, ఒక స్పూన్ నిమ్మ రసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి.బాగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి.
షేవింవ్ చేసుకున్న వెంటనే ఇలా చేస్తే.మంట తగ్గడమే కాదు చర్మం మృదువుగా కూడా ఉంటుంది.
ఇక ఒక బౌల్‌లో కొబ్బరి నూనె మరియు కర్పూరం వేసి బాగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేసి.పావు గంట పాటు డ్రై అవ్వనివ్వాలి.ఆ తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
షేవింగ్ చేసిన వెంటనే ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.