మోకాళ్ళ నొప్పులకు నివారణ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి...!

ప్రస్తుత రోజుల్లో అనేక మందికి వారి జీవనశైలి, వారి వయసు ఆధారపడి చాలామందికి అతి తక్కువ వయస్సు ఉన్నపుడు వారికి మోకాళ్ళ నొప్పులు రావడం మనం గమనిస్తూనే ఉన్నాం.ఈ నొప్పులను తగ్గించుకోవడానికి ప్రజలు హాస్పిటల్ల చుట్టూ లక్షలు లక్షలు ఖర్చు పెడుతూనే ఉన్నారు.

 Home Remedies Knee Pains Health Tips-TeluguStop.com

మొదట్లో మందులు, క్రీమ్స్ రాయడం వంటి నుండి ఉపశమనం పొందినా, చివరికి ఆ సమస్య కొంతమందికి తగ్గకపోవడంతో చివరికి మోకాళ్ళ చిప్పలు రిప్లేస్మెంట్ చేయడం ఒక్కటే ప్రత్యామ్నాయంగా కనబడుతోంది.అయితే ఇలా హాస్పిటల్లో చుట్టూ తిరగకుండా ఉండేందుకు కొన్ని హోం రెమెడీస్ ను ప్రయత్నం చేయడం ద్వారా ఈ సమస్యను కొద్దిమేర తగ్గించుకోవచ్చని తెలుస్తోంది.

ఇక ఇందుకోసం ఏం చేయాలంటే…

 Home Remedies Knee Pains Health Tips-మోకాళ్ళ నొప్పులకు నివారణ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఓ మిక్సీలో ముందుగా కొన్ని మెంతి గింజలను తీసుకొని మెత్తని పొడి చేసుకోవాలి.ఇలా చేసుకున్న పొడిని తీసుకొని జల్లెడ వేయగా వచ్చిన దానిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి.

ఆ తర్వాత మరోసారి నల్లమిరియాలు వేసి మిక్సీ వేసుకోవాలి.ఈ నల్ల మిరియాలను పక్కన పెట్టి మరోసారి జీలకర్ర ను తీసుకొని వాటిని కూడా మిక్సీలో వేసి పక్కన పెట్టుకోవాలి.

ఇలా నల్లమిరియాలు, మెంతి గింజలు, జీలకర్ర విడివిడిగా మిక్సీలో వేసి వాటిని వేసుకున్న, ఈ మూడింటిని సమపాళ్లలో కలుపుకుని గాలి చొరబడని కంటైనర్ లో నిల్వ ఉంచుకోవాలి.

ఇలా పొడిని తయారు చేసుకున్నాక ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక గ్లాసు నీరు తీసుకుని అందులో సగం చెంచా మనం తయారుచేసుకున్న మిశ్రమాన్ని కలుపుకొని తాగాలి.

అయితే, ఈ మిశ్రమం కాస్త కారంగా, చేదుగా అనిపిస్తుంది.ఇలా తాగడానికి కష్టంగా ఉంటే.కాస్త రుచి కోసం ఆ నీటిలో బెల్లాన్ని కలుపుకొని తాగవచ్చు ఇలా ప్రతిరోజు చేయడం ద్వారా అతి త్వరలో మోకాలు నొప్పి తగ్గడం లో ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది.అంతే కాదు శరీరంలో ఇమ్యూనిటీ కూడా పెరగడానికి ఆస్కారం ఉంది.

వీటిని ఖచ్చితంగా 20 రోజుల పైన క్రమం తప్పకుండా వాడితే మంచి రిజల్ట్స్ ఆశించవచ్చు.

#Knee Pains #Black Pepper #Pain #Menthi Seeds #Rid Knee Pains

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు