కీళ్ళ నొప్పులకి ఇంటి చిట్కా తో పరిష్కారం

ఇప్పుడు ఉన్న ఈ ఉరుకులు పరుగుల సమాజంలో.చిన్నా పెద్దా తేడా లేకుండా అందరికీ సమానంగా జబ్బులు వస్తున్నాయి.

 Home Remedies Knee Pains Knee Pains, Home Remedies, Tips To Reduce Knee Pains,he-TeluguStop.com

పూర్వం కీళ్ళ నొప్పులు అంటే వయసు మళ్ళిన వాళ్లకి మాత్రమే వచ్చేవి.కానీ ఇప్పుడు నడివయస్సు,టీనేజ్ వయసు వాళ్ళకి కూడా ఈ రోగం వస్తోంది.

అసలు ఈ నొప్పులు రావడానికి గల కారణాలు అనేకం.

ఎప్పటికప్పుడు తనకి తానూ అప్డేట్ అవుతున్న మనిషి ,ఆరోగ్య జాగ్రత్తలు పాటించడంలో మాత్రం వెనకపడే ఉన్నాడు.

సరైన సమయంలో భోజనం చేయలేకపోవడం,శరీరానికి అవయవాలకి తగట్టుగా వ్యాయామం చేయకపోవడం ఈ సమస్యలకి కారణం.ముఖ్యంగా కీళ్ళ నొప్పులు వయస్సు పెరుగుతున్న వారిలో అధికంగా ఉంటుంది.చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని స్థితి లోకి వెళ్లిపోతుంటారు.మన ఇంటిలో లభించే పదార్ధాలు ఉపయోగించి కీళ్ళ నొప్పులని పరిష్కరించుకోవచ్చు.

వెల్లుల్లి రిబ్బలు నాలుగు తీసుకుని వాటిని నువ్వుల నునే లో బాగా మరిగించి తరువాత వడబోసి ఆ నునే తో మర్దనా చేసుకోవాలి.

ఆవాలతో చేసిన ఆవనూనే ని తీసుకుని రోజు మర్దనా చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.

ఉల్లిపాయలు,ఆవాలు సమపాళ్ళలో తీసుకుని బాగా నూరుకోవాలి.ముద్దగా వచ్చిన ఈ మిశ్రమాన్ని కీళ్ళపై ఉంచి మర్దనా చేసుకుంటే ఉపశమనం దొరుకుతుంది.

అలాగే దానిమ్మ చిగుళ్ళు,సైంధవ లవణం కలిపి నూరుకోవాలి.ఈ ముద్దని పప్పు బద్దంత మాత్రలుగా చేసుకుని మూడు పూటలా తీసుకుంటే మంచి ఫలితాలని ఇస్తుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube