పైల్స్ సమస్యను తగ్గించే అద్భుతమైన,సులభమైన చిట్కాలు     2018-06-12   23:07:32  IST  Lakshmi P

పైల్స్ సమస్య వచ్చినప్పుడు వచ్చే బాధ విపరీతంగా ఉంటుంది. ఏ పని మీద దృష్టి పెట్టలేరు. అంతేకాక చాలా చిరాకుగా ఉంటుంది. కాల‌కృత్యాలు తీర్చుకోవటానికి వెళ్లిన ప్రతిసారి మంట,నొప్పితో విపరీతమైన నరకయాతన అనుభవించాల్సి ఉంటుంది. పైల్స్ రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి మ‌ల‌బ‌ద్ద‌కం, థైరాయిడ్‌, డ‌యాబెటిస్‌, మాంసం, ఫాస్ట్‌ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవటం మరియు ఎక్కువ సేపు కూర్చోవటం వంటివి కారణాలు. ఈ సమస్యకు డాక్టర్ ఇచ్చిన మందులను వాడుతూ ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటిస్తే మంచి ఉపశమనం కలుగుతుంది.

ఒక కప్పు నీటిలో నాలుగు బిర్యాని ఆకులు,మూడు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడకట్టి చల్లారబెట్టాలి. ఈ నీటిని నొప్పి ఉన్న ప్రాంతంలో రాయాలి. ఈ విధంగా రోజులో మూడు సార్లు రాయాలి.

తెల్ల చామంతి పువ్వును రేకలుగా విడతీసి ఒక కప్పు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని వడకట్టి చల్లారబెట్టాలి. ఈ నీటిని నొప్పి ఉన్న ప్రాంతంలో రాయాలి. ఈ విధంగా రోజులో మూడు సార్లు రాయాలి.