సూర్య కిరణాల కారణంగా వచ్చే మచ్చలను తగ్గించుకోవటానికి టిప్స్     2018-05-03   00:53:26  IST  Lakshmi P

సూర్యుని నుండి వెలుబడే అతినీలలోహిత కిరణాల కారణంగా ముఖంపై మరియు శరీరంపై మచ్చలు వస్తూ ఉంటాయి. ఈ మచ్చలు వచ్చినప్పుడు ఎటువంతో కంగారు పడవలసిన అవసరం లేదు. అలాగే ఖరీదైన కాస్మొటిక్స్ కొనవలసిన అవసరం లేదు. మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో సులభంగా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

అలోవెరాలో ఉన్న అద్భుతమైన లక్షణాలు చర్మాన్ని కాంతివంతంగా మార్చటమే కాకుండా ముఖంపై ఏర్పడిన మచ్చలను తొలగించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. అలోవెరా జెల్ ని మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి 5 నిముషాలు మసాజ్ చేసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.