మెడ నొప్పిని వేగంగా తగ్గించుకోవటం ఎలా

మెడ నిర్మాణం అనేది ఎముకలు (వెన్నుపూస), నరాలు, కండరాలు, ఎముకల మధ్య డిస్క్ లతో ఉంటుంది.మెడ నొప్పి అనేది అసాదారణంగా సంభవించే ఒక సాధారణ వైద్య పరిస్థితి.

 Home Remedies For Neck Pain-TeluguStop.com

సరైన భంగిమలో కుర్చోకపోవటం, నిద్ర స్థానం సరిగ్గా లేకపోవటం, ఒత్తిడి,క్రీడలు,వ్యాయామం చేసే సమయంలో మెడకు గాయాలు,మెడ బెణుకు వంటి కారణాల వలన మెడ నొప్పి వస్తుంది.కొన్నిసార్లు కీళ్ళనొప్పులు, ఆస్టియో ఫ్లోరోసిస్ మరియు ఫైబ్రోమైయాల్జియా వంటి కొన్ని వ్యాధుల కారణంగా కూడా ఏర్పడుతుంది.

మెడ నొప్పి అనేది ప్రాణ హాని కలిగించే సమస్య కాదు.కొన్ని ఇంటి నివారణలతో సులభంగా బయట పడవచ్చు.

1.ఐస్ ప్యాక్

ఐస్ ప్యాక్ అనేది మెడ కండరాలు వాపు మరియు మెడ నొప్పిని తగ్గించుకోవటానికి సహాయపడుతుంది.ఈ ప్యాక్ నొప్పిని మరియు వాపును సమర్ధవంతంగా తగ్గిస్తుంది.

కావలసినవి
ఫ్రిజ్ అయిన బటానీల బాగ్ లేదా చల్లని జెల్ ప్యాక్

పద్దతి
* నొప్పి ఉన్న ప్రాంతంలో ఐస్ ప్యాక్ ని 15 నిముషాలు ఉంచాలి
* మెడ నొప్పి నుండి ఉపశమనం పొందటానికి ప్రతి 2 లేదా 3 గంటలకు ఒకసారి ఈ పద్ధతిని అనుసరించాలి.

2.వేడి కాపడం


ఈ నివారణ నిర్దిష్ట ప్రాంతంలో రక్త ప్రసరణ పెంచడం ద్వారా మెడ నొప్పి నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.గట్టిగా ఉన్న కండరాలను సరళతరం చేసి మెడ నొప్పిని తగ్గిస్తుంది.

కావలసినవి
వేడి నీటి బాటిల్ లేదా వేడి జెల్ ప్యాక్

పద్దతి
* నొప్పి ఉన్న ప్రాంతంలో వేడి నీటి బాటిల్ లేదా వేడి జెల్ ప్యాక్ ని పెట్టాలి
* ఆ ప్రాంతంలో 15 నిమిషాల పాటు ఉంచాలి
* ఈ విధంగా ప్రతి మూడు లేదా నాలుగు గంటలకు ఒకసారి చేస్తే మెడ నొప్పి తగ్గుతుంది.

3.చల్లని మరియు వేడి కాపడాల కాంబినేషన్


ఒత్తిడికి గురి అయిన మెడ కండరాల వస్యతకు సహాయపడి మెడ నొప్పి ఉపశమనంలో సహాయపడుతుంది.

అలాగే మెడ కండరాలు త్వరగా శక్తిని పొందటానికి కూడా సహాయపడుతుంది.

కావలసినవి
వేడి నీటి బాటిల్ లేదా వేడి జెల్ ప్యాక్ ఫ్రిజ్ అయిన బటానీల బాగ్ లేదా చల్లని జెల్ ప్యాక్

పద్దతి
* నొప్పి ఉన్న మెడ ప్రాంతంలో వేడి ప్యాక్ ని 15 నిముషాలు ఉంచాలి
* వేడి ప్యాక్ తొలగించిన తర్వాత ఐస్ ప్యాక్ ని 15 నిముషాలు పెట్టాలి
* ఒకే సమయంలో రెండు ప్యాక్ లను ప్రత్యామ్నాయంగా పెట్టాలి
* మెడ నొప్పి తగ్గటానికి ప్రతి రెండు లేదా మూడు గంటలకు ఒకసారి పెట్టాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube