అంటువ్యాధులకు(ఇన్ ఫెక్షన్) సహజ నివారణలు

ఇన్ ఫెక్షన్స్ లో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్ వంటి రకాలు ఉన్నాయి.మన దైనందిన జీవితంలో ఏదో ఒక ఇన్ ఫెక్షన్ తో బాధ పడుతూ ఉండవచ్చు.

 Home Remedies For Infections-TeluguStop.com

అయితే ఇవి ప్రాధమిక దశలో ఉంటే పెద్ద ప్రమాదం కాదు.వీటి చికిత్సకు ఎక్కువగా యాంటీబయాటిక్స్ ని వాడుతూ ఉంటాం.

అయితే కొన్ని సహజమైన పదార్దాలతో అంటువ్యాధులకు చికిత్స చేయవచ్చు.ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

1.పసుపు
పసుపు అనేది మన వంటగదిలో ఉండే ఒక సాదారణమైన పదార్దం.పసుపులో యాంటీబ్యాక్టీరియల్, ఏంటి సెప్టిక్, శోథ నిరోధక లక్షణాలు సమృద్దిగా ఉన్నాయి.అందువలన పసుపు ఇన్ ఫెక్షన్స్ మీద పోరాటం చేస్తుంది.మొటిమలు ఉన్నప్పుడు, ముఖానికి పసుపు రాస్తే మొటిమలు మాయం అవుతాయి.పసుపులో ఏంటి సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన మొటిమలకు కారణం అయిన క్రిములను చంపుతుంది.

అలాగే ప్రేగు ఇన్ఫెక్షన్ కు కూడా బాగా పనిచేస్తుంది.

ఒక గ్లాస్ పాలు లేదా వేడి నీటిలో ఒక స్పూన్ పసుపు కలిపి త్రాగాలి.

ఈ పానీయాన్ని రోజుకి రెండు సార్లు త్రాగితే కడుపు ఇన్ ఫెక్షన్స్ తగ్గుతాయి.తాజా పసుపును తీసుకుంటే క్యాన్సర్ నిరోధించడానికి సహాయపడుతుంది.యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన వాపు,నొప్పులను తగ్గిస్తుంది.

2.వేప ఆకులు
వేప ఆకులు అనేవి ఇన్ ఫెక్షన్స్ తగ్గించటానికి మరొక సమర్ధవంతమైన పదార్ధంగా చెప్పవచ్చు.వసంత కాలంలో వచ్చే చికెన్ ఫాక్స్ వంటి ఇన్ ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది.

ఇవి కుటుంబంలో ఒకరికి వస్తే అందరికి సోకుతాయి.అటువంటి ఇన్ ఫెక్షన్స్ ని వేప సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.

వేప ఆకులను వేగించి లేదా బేక్ చేసుకొని తినవచ్చు.

మరిగే నీటిలో వేప ఆకులను వేసి, ఆ నీటిని స్నానానికి ఉపయోగించవచ్చు.

వేప ఆకుల నుంచి రసాన్ని తీసి ముఖానికి రాస్తే మొటిమలు మరియు మొటిమల మచ్చలు తగ్గుతాయి.భోజనానికి ముందు రెండు వేప ఆకులను నమిలితే ఆకలి పెరుగుతుంది.

3.తులసి ఆకులు
తులసి ఆకులు గొంతు ఇన్ఫెక్షన్ కి బాగా పనిచేస్తుంది.

తులసి ఆకులను క్రష్ చేసి రసాన్ని తీసి దానిలో తేనే కలుపుకొని త్రాగాలి.గొంతు ఇన్ఫెక్షన్, వాపు మరియు నొప్పిని తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

తులసి,తేనే రెండు కూడా దగ్గు,రొంపను తగ్గిస్తాయి.అలాగే మోటిమల చికిత్సలో కూడా బాగా పనిచేస్తుంది.దీనిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్దిగా ఉండుట వలన క్యాన్సర్ వ్యాధి నివారణలో సహాయపడుతుంది.

4.వెల్లుల్లి
వెల్లుల్లిలో అద్భుతమైన యాంటీబ్యాక్టీరియ లక్షణాలు ఉన్నాయి.అందువలన ఇది మోటిమలు, అతిసారం, గొంతు ఇన్ఫెక్షన్ వంటి వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది.వెల్లుల్లిని క్రష్ చేసి మొటిమల మీద రాస్తే మొటిమలు తగ్గుతాయి.నీటిలో క్రష్ చేసిన వెల్లుల్లిని వేసి మరిగించి ఆ నీటిని త్రాగితే అతిసారం తగ్గుతుంది.

వేడి వెల్లుల్లి సూప్ త్రాగితే గొంతు ఇన్ఫెక్షన్ సమస్య పరిష్కరించడానికి సహాయపడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube