సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడూ కొందరికి చెమటలు పడుతూనే ఉంటాయి.శరీరంలో స్వేదగ్రంధులు ఉంటాయి.
వీటి ద్వారా ప్రతి ఒక్కరిలో చెమటలు పట్టడం సహజం.కానీ, కొందరిలో మాత్రం కాస్త అధికంగా చెమటలు పడుతునే ఉంటాయి.
ఒత్తిడి, థైరాయిడ్, శరీర ఉష్ణోగ్రతలు, లో బ్లడ్ షుగర్, మెనోపాజ్, పలు రకాల మందుల వాడకం ఇలా రకరకాల కారణాల వల్ల అధికంగా చెమటలు పడుతుంటాయి.ఇక అధికంగా చెమటలు పట్టడం వల్ల.
దుర్వాసన, బట్టలు తడచిపోవడం, చికాకు, దురద ఇలా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ టిప్స్ ఫాలో అయితే.
ఈజీగా అధిక చెమటల సమస్యకు చెక్ పెట్టవచ్చు.మరి ఆ టిప్స్ ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక చెమటలను తగ్గించడంలో రోజ్ వాటర్ అద్భుతంగా సహాయపడుతుంది.ఒక బౌల్‌లో రోజ్ వాటర్ మరియు వెనిగర్ సమానంగా తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఉదయం స్నానం చేసే ముందు ఒంటికి అప్లై చేసి.కాసేపు మసాజ్ చేసుకుని బాత్ చేయాలి.
ఇలా చేయడం వల్ల చెమటలు తగ్గడం తగ్గుముఖం పడతాయి.

అలాగే చెమటలను తగ్గించడంలో అరటి పండ్లు గ్రేట్‌గా సహాయపడతాయి.అరటి పండ్లలో పుష్కలంగా ఉండే పోటాషియం చెమటలు పట్టడాన్ని తగ్గిస్తాయి.కాబట్టి, అధికంగా చెమటలు పట్టే వారు ప్రతి రోజు ఒకటి లేదా రెండు అరటి పండ్లు తింటే మంచిది.
ఇక ఒక బౌల్‌లో బేకింగ్ సోడా, కార్న్ ఫ్లోర్ సమానంగా తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని అధికంగా చెమటల పట్టే ప్రాంతాల్లో అప్లై చేసి.
ఇరవై నిమిషాల తర్వాత వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేసినా చెమటలు పట్టడం తగ్గుతుంది.
అలాగే చెమటలను తగ్గించడంలో నిమ్మకాయ కూడా సూపర్‌గా ఉపయోగపడుతుంది.నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది.ఇది బ్యాక్టీరియాను తొలగించడమే, అధిక చెమటను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.అందువల్ల, ఒక నిమ్మ బద్ద తీసుకుని బాగా చెమటలు పట్టే ప్రాంతంలో రుద్దడం లేదా స్నానం చేసే నీటిలో నిమ్మ రసం కలిసి స్నానం చేయడం వంటివి చేస్తే అధిక చెమటలు తగ్గుముఖం పడతాయి.