ప్రస్తుతం వింటర్ సీజన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఈ సీజన్‌లో చలితో పాటుగా అనేక రకాల జబ్బులు కూడా తెగ ఇబ్బంది పెడుతుంటాయి .
ముఖ్యంగా ఈ వింటర్ సీజన్ ముక్క దిబ్బడ సమస్యను చాలా మంది ఫేస్ చేస్తుంటారు.ముక్క దిబ్బడ ఉంటే.
ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉంటుంది.అందులోనూ రాత్రి వేళ శ్వాస తీసుకునేందుకు మరింత బాధ పడాల్సి వస్తుంది.
దీంతో సరిగ్గా నిద్ర కూడా పట్టదు.ఫలితంగా ఉదయానికి అలసట, కళ్లు మంటలు, నీరసం వంటి సమస్యలు ఏర్పడతాయి.
అయితే ఇప్పుడు చెప్పబోయే టిప్స్‌ను ఫాలో అయితే.సులువుగా ముక్కు దిబ్బడ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
మరి ఆ టిప్స్ ఏంటీ అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముక్కు దిబ్బడను తగ్గించడంలో ఉల్లిపాయ అద్భుతంగా సమాయపడుతుంది.
కోసేటప్పుడు కన్నీరు పెట్టించే ఉల్లిపాయ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందన్న సంగతి తెలిసిందే.అయితే ముక్కు దిబ్బడ ఇబ్బంది పెడుతున్నప్పుడు.
ఉల్లిపాయను సగానికి కట్ చేసి.దాని వాసన పీలుస్తూ ఉండాలి.
ఇలా చేయడం వల్ల ముక్కు దిబ్బడ నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు.
అలాగే వెల్లుల్లి కూడా ముక్కు దిబ్బడను తగ్గించగలదు.ముందుకు మూడు వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి.పేస్ట్ చేసుకోవాలి.
ఆ పేస్ట్‌ను గోరు వెచ్చని నీటితో కలిపి సేవించాలి.ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఇక ముక్కు దిబ్బడ సమస్యతో బాధ పడుతున్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ చల్లటి నీరు తీసుకో రాదు.ఎప్పుడూ గోరు వెచ్చగా ఉన్న నీటినే తీసుకోవాలి.
అదేవిధంగా, ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడుతున్న వారు.నీటిలో కొద్దిగా పసుపు, తులసి ఆకులు వేసి బాగా మరిగించాలి.
అనంతరం ఈ నీటిని రోజుకు రెండు సార్లు ఆవిరి పట్టాలి.ఇలా చేసినా కూడా ముక్కు దిబ్బడ సమస్యకు త్వరగా చెక్ పెట్టవచ్చు.