పాదాలపై ట్యాన్‌ను తొలిగించే బెస్ట్ హోమ్ రెమెడీస్ ఇవే!

ట్యాన్ కార‌ణంగా ఒక్కో సారి పాదాలు న‌ల్ల‌గా, అంద‌హీనంగా క‌నిపిస్తుంటాయి.పాదాలు ట్యాన్ అవ్వ‌డానికి ఎండ మాత్ర‌మే కార‌ణం కాదు.

కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే ప్రోడెక్ట్స్ వాడ‌కం, క‌ఠిన‌మైన స‌బ్బుల వాడ‌కం, కాలుష్యం, శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగి పోవడం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల పాదాలు ట్యాన్ అవుతుంటాయి.దాంతో ఏం చేయాలో తెలియ‌క‌.

పాదాల‌ను ఎలా తెల్ల‌గా మార్చుకోవాలో అర్థంగాక స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్ పాటిస్తే.

పాదాల‌ను అందంగా, కాంతివంతంగా మెరిపించుకోవ‌చ్చు.మ‌రి ఆ టిప్స్ ఏంటో చూసేయండి.

Advertisement

ముందుగా కొన్ని అవిసె గింజ‌లు తీసుకుని పొడి చేసుకోవాలి.ఇప్పుడు ఈ పొడిలో నిమ్మ‌రసం మ‌రియు పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు అప్లై చేసి.

ఇర‌వై, ముప్పై నిమిషాల పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.అనంత‌రం కాస్త నీళ్లు జ‌ల్లి.

స్క్ర‌బ్ చేసుకుంటూ పాదాల‌ను శుభ్రం చేసుకోవాలి.ఆ త‌ర్వాత పాదాల‌కు మాయిశ్చ‌రైజ‌ర్ పూసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే ట్యాన్ స‌మ‌స్య దూర‌మై.పాదాలు తెల్ల‌గా, మృదువుగా మార‌తాయి.

రాజమౌళి వల్లే టాలీవుడ్ హీరోలకు ఈ స్థాయిలో గుర్తింపు.. నమ్మకపోయినా నిజమిదేనా?
రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 

అలాగే ఒక బౌల్ తీసుకుని బియ్యం పిండి, బంగాళ‌దుంప ర‌సం వేసుకుని క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు పూసి.

Advertisement

ఆరిన త‌ర్వాత బాగా స్క్ర‌బ్ చేసుకోవాలి.అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో పాదాల‌ను శుభ్రం చేసుకోవాలి.

రోజుకు ఒక సారి ఇలా చేస్తే.పాదాలు తెల్ల‌గా, కాంతివంతంగా త‌యార‌వుతాయి.

ఒక బౌల్‌లో షుగ‌ర్ మ‌రియు పైనాపిల్ ర‌సం వేసి క‌లుపుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని పాదాల‌కు ప‌ట్టించి.వేళ్ల‌తో మెల్ల‌ మెల్ల‌గా స్క్ర‌బ్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో పాదాల‌ను క్లీన్ చేసుకుని.మాయిశ్చ‌రైజ‌ర్ అప్లై చేసుకోవాలి.

ఇలా చేసినా కూడా మంచి ఫ‌లితం ఉంటుంది.

తాజా వార్తలు