సాధారణంగా కొందరి కళ్ళు తరచూ పొడిబారిపోతూ ఉంటాయి.కంప్యూటర్ల ముందు గంటలు తరబడి పని చేయడం, వేడి వాతావరణంలో ఉండటం, డీహైడ్రేషన్, ఆహారపు అలవాట్లు, ఫోన్లు మరియు టీవీలను అతిగా చూడటం, దుమ్ము, ధూళి, నిద్ర లేమి ఇలా రకరకాల కారణాల వల్ల కళ్ళలోని తేమ తగ్గిపోతుంది.
దాంతో కళ్ళ పొడిగా మారిపోయి.అసౌకర్యానికి గురి చేస్తుంటాయి.
అయితే అలాంటి సమయంలో కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ ను పాటిస్తే సులభంగా ఈ సమస్యను నివారించుకోవచ్చు.మరి ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏంటో చూసేయండి.అవిసె గింజల నూనె పొడిబారిన కళ్ళను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.దూది ఉండను అవిసె గింజల నూనెలో ముంచి మూసిన కనురెప్పలపై పది హేను నిమిషాల పాటు ఉంచాలి.
అనంతరం చల్లటి నీటితో కళ్లను శుభ్రం చేసుకోవాలి.ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే.
కళ్ళు మళ్లీ తేమగా మారతాయి.
అలాగే గోరు వెచ్చని నీటితో రోజ్ వాటర్ వేసి మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ నీటిలో శుభ్రమైన కాటన్ క్లాత్‌ను నానబెట్టుకోవాలి.ఆ తర్వాత కాటన్ క్లాత్‌ను తీసుకుని కనురెప్పలపై ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉంచుకోవాలి.
అనంతరం కూల్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల దుమ్ము, ధూళి బయటకు వచ్చేసి.
పొడి బారిన కళ్ళు తేమగా మారతాయి.పొడి కళ్ళను నివారించడంలో గ్రీన్ టీ గ్రేట్‌గా సమాయపడుతుంది.
గోరు వెచ్చగా ఉన్న గ్రీన్ టీని దూది సాయంతో కళ్ళపై అప్లై చేసుకుని.పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్ర పరుచుకోవాలి.
ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.ఇక వీటితో వీటితో పాటు వాటర్ ఎక్కువగా తాగాలి.
మంచిగా నిద్ర పోవాలి.ల్యాప్‌టాప్, మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్లను చూసే సమయంలో తరచూ కళ్ళ రెప్పలను అర్పడం, తెరవడం చేయాలి.
తద్వారా కళ్ళు పొడిబారకుండా ఉంటాయి.