కాలిన గాయాలు త్వరగా తగ్గాలంటే....సులభమైన చిట్కాలు  

Home Remedies For Burns-

వంటింట్లో వేడి వేడి పత్రాలు చేతికి పొరపాటున తగలటం వల్ల కాలిన ప్రదేశంలో బొబ్బలు వచ్చి మంట అన్పించటం సహజమే.ఈ సమస్య నుండి త్వరగా బయటపడాలంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలతో మంచి ఉపశమనం కలుగుతుంది.బ్లాక్ టీఈ బ్యాగ్ లను డీప్ ఫ్రిజ్ లో కొంచెం సేపు ఉంచాలి..

Home Remedies For Burns---

ఈ బ్యాగ్ లను కాలిన గాయాలపై ఉంచాలి.బ్లాక్ టీలో టానిక్ యాసిడ్ చర్మానికి ఉపశమనం కలుగుతుంది.అలాగే నొప్పి,మంట తగ్గిస్తుంది.

తేనేఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉంటాయి.తేనెను రాత్రి సమయంలో పడుకొనే ముందు కాలిన గాయాల మీద రాయాలి.ఈ విధంగా చేయటం వలన ఇన్ ఫెక్షన్ దరి చేరకుండా ఉంటుంది.

పాలుకాలిన ప్రదేశంలో పాలు రాయాలి.ఈ విధంగా చేయటం వలన తొందరగా ఉపశమనం కలుగుతుంది.అంతేకాక మంట ఎక్కువగా ఉన్న సమయంలో ఫ్రిడ్జ్ లో పెట్టిన పాలలో దూదిని ముంచి కాలిన గాయాలపై రాయాలి.

పుదీనా ఆకులుపుదీనా ఆకులను పేస్ట్ గా చేసి కాలిన గాయాలపై రాయాలి.కొంచెం సేపు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేయాలి.పుదీనా మంటను తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.