పెద‌వులు ఎప్పుడూ అందంగా క‌నిపించాలంటే ఇలా చేయాల్సిందే!

పెద‌వులు ఎర్ర‌గా, మృదువుగా, అందంగా క‌నిపిస్తే.ముఖం కూడా అందంగా క‌నిపిస్తుంది.

 Home Remedies For Beautiful Lips! Home Remedies, Beautiful Lips, Lip Care, Lips,-TeluguStop.com

కానీ, కొంద‌రి ముఖ్యంగా చక్కని రంగులో ఉన్నా.పెద‌వులు మాత్రం న‌ల్ల‌గా, అంద‌హీనంగా ఉంటాయి.

కేర్ తీసుకోక‌పోవ‌డం, ఆహార‌పు అల‌వాట్లు, పొల్యూష‌న్ ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల‌ పెదాలు అంద‌హీనంగా మార‌తాయి.ఇలాంటి వారు త‌మ పెద‌వుల‌ను అందంగా మార్చుకునేందుకు నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

అయిన‌ప్ప‌టికీ, ఫలితం లేకుంటే తెగ‌ బాధ ప‌డ‌తారు.అలాంటి వారు ఇప్పుడు చెప్ప‌బోయే టిప్స్‌ను ఫాలో అయితే.

ఎప్పుడూ మీ పెద‌వులు అందంగా ఉంచుకోవ‌చ్చు.మ‌రి ఆ టిప్స్ ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా చూసేయండి.

ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా బాదం ఆయిల్ మ‌రియు తేనె స‌మానంగా తీసుకుని.పెద‌వుల‌కు అప్లై చేయండి.ఇర‌వై నిమిషాల పాటు ఆర‌నిచ్చి.ఆ త‌ర్వ‌త చ‌ల్ల‌టి నీటితో పెదాల‌కు శుభ్రంగా తీసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల‌.పెద‌వుల‌పై ఉన్న మృత‌క‌ణాలు, మురికి పోయి.

అందంగా, మృదువుగా మార‌తాయి.

Telugu Beautiful Lips, Tips, Latest, Lip Care, Lips, Rosy Lips-Telugu Health -

స్ట్రాబెర్రీలను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసి ఒక బౌల్‌లో వేసుకోవాలి.ఆ త‌ర్వాత అందులో కొద్దిగా పెట్రోలియం జెల్లీ క‌లిపి.పెద‌వులకు త‌ర‌చూ అప్లై చేస్తూ ఉండాలి.

ఇలా చేయ‌డం వ‌ల్ల న‌ల్ల‌ని పెదాలు.క్ర‌మంగా ఎర్ర‌గా మారిపోతాయి.

అలాగే నిద్రించే ముందు.పెదాల‌కు ఉన్న లిప్‌స్టిక్ తీసేసి వాట‌ర్‌తో క్లాన్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఇంట్లో త‌యారు చేసుకున్న రోజ్ వాట‌ర్ పెదాల‌కు అప్లై చేసి ప‌డుకోవాలి.ఇలా ప్ర‌తి రోజు చేయ‌డం వ‌ల్ల పెద‌వులు అందంగా మ‌రియు గ్లోయింగ్‌గా మార‌తాయి.

కీరాను పేస్ట్ చేసుకుని.ర‌సం తీసుకోవాలి.ఆ ర‌సాన్ని పెదాల‌కు అప్లై చేసి.ఇర‌వై నిమిషాల త‌ర్వాత చ‌ల్ల‌టి వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల కూడా మురికి పోయి రోజీ లిప్స్ మీ సొంతం అవుతాయి.అలాగే చాలా మంది లిప్ బామ్ వాడుతంటారు.

అయితే సన్‌స్క్రీన్ ఉన్న లిప్ బామ్ వాడితే.ఎండ నుంచి మీ పెద‌వుల‌కు ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.

ఇక లిక్విడ్స్ ఎక్కువ‌గా తీసుకుంటూ ఉండాలి.శ‌రీరం డీహైడ్రేట్ అయినా.

పెదాలు అందహీనంగా మార‌తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube