కాంతివంతమైన ముఖానికి సులువైన చిట్కాలు  

ముఖం కాంతివంతగా, అందంగా మెరిసిపోవాలని ఎవరు కోరుకోరు. ఈ కాలంలో అయితే అందానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ముఖం మృదువుగా, నిగనిగలాడుతూ ఉండాంటే, మార్కేట్లో దొరుకుతున్న రకరకలా వస్తువులు వాడే బదులు, టైమ్ దొరికించుకోని, కాస్త కష్టపడితే ఇంట్లోంచే, కెమికల్స్ వాడకుండా మీ ముఖాన్ని అందంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కాంతివంతమైన చర్మానికి ఇంట్లో ఉన్న చిట్కాలు ఏంటో చూద్దాం.

* ఆల్మండ్స్ ని పేస్ట్ లాగా చేసుకోని, దాంట్లోకి కాస్త తేనే, వేడిగా ఉన్న పాలు కలుపుకోని ముఖం మీద రాసుకుంటే చర్మం తేజస్సుని పొందుతుంది. అదే ఆయిలి స్కిన్ ఉన్నవారైతే శనగపిండిలోకి పాలు కలుపుకోని వాడాలి.

* శనగపిండిలోకి పసుపు, పెరుగు మరియు నిమ్మరసం కలుపుకోని వాడుకున్నా మంచి ఫలితాలు కనిపిస్తాయి.

* ఎండవలన చర్మం ట్యాన్ అయితే, అలోవెరా, టమాట, ఆపిల్ సైడ్ వెనిగర్ బాగా పనిచేస్తాయి.

* ముడతలు పోగొట్టాలంటే కొబ్బరినూనేతో మసాజ్ చేస్తూ ఉండండి. పైనాపిల్ తో మాసాజ్ చేసిన ఫలితం ఉంటుంది. అలాగే అరటిపండు ముడతలకే కాదు, ముఖం రంగు తేలడానికి కూడా పనికివస్తుంది. అరటితొక్కను కూడా వదలకుండా ముఖానికి అరటిపండు రాయండి.

* ఇక కనుల కింద వలయాలకి కాఫీ పౌడర్, కీరదోస చెక్ పెడతాయి.