పిల్లలు తరచూ పక్క ఎందుకు తడుపుతారో తెలుసా?

పిల్లలు పక్క తడపడం సర్వసాధారణం.అయితే తరచూ ఇలా చేయడం వల్ల వారికి ఎంతో చిరాకుగా అనిపిస్తుంది.

 Reasons Why Children Wet The Bed, Home Remedies, Bed Wetting, Children, Diabetic-TeluguStop.com

కొందరు పిల్లలు పెద్దయ్యాక కూడా పక్క తడుపుతూ ఉంటారు.దానివల్ల తల్లిదండ్రులు వారి మీద చిరాకు పడుతూ ఉంటారు, అయితే పిల్లలు ఇది కావాలని చేసే విషయం కాదు కాబట్టి, తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు చెప్పడం వల్ల వారిలో మార్పు రావచ్చు.

సాధారణంగా ఏడు సంవత్సరాలలోపు పిల్లలు ప్రతి రోజు పక్క తడుపుతూ ఉండడం సాధారణమే, కాకపోతే అంతకన్నా పెద్ద పిల్లలు పక్క తడుపుతూ ఉంటే, వారిలో సమస్యలు ఏం ఉన్నాయ్ అనేది ఒకసారి డాక్టర్ ని సంప్రదించడం మంచిది.అయితే చిన్నపిల్లలలో యూరిన్ కంట్రోల్ చేసే కెపాసిటీ వారిలో లేకపోవడం వల్ల తరచూ నిద్రలో మూత్రం చేస్తూ ఉంటారు.
మూత్రాశయాన్ని నియంత్రించే నరాలు నిదానంగా పరిపక్వత చెందడం వల్ల పిల్లలు గాఢనిద్రలో ఉన్నప్పుడు రాత్రి సమయంలో వారికి తెలియకుండానే మూత్రం చేసేస్తారు.మూత్ర విసర్జనను నియంత్రించడానికి కండరాల కదలిక ఎంతగానో ఉపయోగపడుతుంది.

మలబద్ధకంతో బాధపడేవారికి, ఈ కండరాలలో కదలిక లేనప్పుడు, రాత్రి సమయంలో ఎక్కువగా పక్క తడుపుతూ ఉంటారు.

అంతేకాకుండా మూత్రాశయం మూత్రనాళంలో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ల కారణంగా రాత్రి సమయంలో మూత్రం చేస్తూ ఉంటారు.

ఊబకాయం, మధుమేహం, నాడీ వ్యవస్థలోని లోపాలు ఉండడం వల్ల తరచూ పిల్లలు పక్క తడుపుతూ ఉంటారు.ఇలాంటి సమస్యలతో బాధపడే పిల్లలకు సరైన వైద్యం చేయించడం లేదా జాగ్రత్తలు చెప్పడం ద్వారా వారిలో మార్పు తీసుకురావాలి.

అంతే కానీ వారిని చులకనగా చేసి మాట్లాడడం వల్ల వారు మానసికంగా ఎంతో కృంగిపోతుంటారు.చూశారు కదా.పిల్లల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు.లేదంటే పిల్లలు వయసు పెరిగినప్పటికీ పక్క తడిపి ఇబ్బంది పెడుతారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube