పెదాలు పగిలి మంట పుడుతున్నాయా..అయితే ఈ టిప్స్ మీకే!

సాధార‌ణంగా కొంద‌రి పెద‌వులు త‌ర‌చూ ప‌గిలి పోతుంటాయి.ఇక పెదాలు పగిలితే.

 Home Remedies Chapped Lips Lip Care Lips Latest News-TeluguStop.com

ఎంత తీవ్ర‌మైన నొప్పి, మంట ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.అందుకే ప‌గిలిన పెదాల‌ను ని వారించుకునేందుకు ఖ‌రీదైన క్రీములు, ఆయిల్స్ కొనుగోలు చేసి వాడుతుంటారు.

అయిన‌ప్ప‌టికీ, ఫ‌లితం లేకుండా.ఎలా త‌గ్గించుకోవాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతుంటారు.

 Home Remedies Chapped Lips Lip Care Lips Latest News-పెదాలు పగిలి మంట పుడుతున్నాయా..అయితే ఈ టిప్స్ మీకే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇప్పబోయే సింపుల్ టిప్స్ పాటిస్తే.సులువుగా ప‌గిలి మంట పుట్టించే పెదాల‌ను మృదువుగా, అందంగా మార్చుకోవ‌చ్చు.

మ‌రి ఆ టిప్స్ ఏంటో లేట్ చేయ‌కుండా ఇప్పుడు చూసేయండి.

ప‌గిలిన పెదాల‌ను నివారించ‌డంలో ట‌మాటా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

బాగా పండిన ట‌మాటా తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఆ పేస్ట్‌ను పెదాల‌పై అప్లై చేసి.

ఇర‌వై లేదా ముప్పై నిమిషాల పాటు వ‌దిలేయాలి.ఆ త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో పెదాల‌ను క్లీన్ చేసుకోవాలి.

ఇలా రోజుకు ఒక‌టి లేదా రెండు సార్లు చేస్తూ ఉంటే.పెదాలు మృదువుగా, అందంగా మార‌తాయి.

Telugu Beauty, Beauty Tips, Chapped Lips, Home Remedies, Latest News, Lip Care, Lip Packs, Lips-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు

గులాబీలు కూడా పెదాల ప‌గుళ్ల‌ను నివారిస్తాయి.కొన్ని గులాబీ రేక‌లు తీసుకుని పాల‌లో వేసి రెండు గంట‌ల పాటు నాన బెట్టుకోవాలి.ఆ త‌ర్వాత మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెద‌వుల‌కు పూత‌లా వేయాలి.పావు గంట పాటు ఆర‌నిచ్చి.ఆ త‌ర్వాత కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

ఇలా త‌ర‌చూ చేస్తే.ప‌గిలిన పెదాలు కోమ‌లంగా మార‌తాయి.

ఇక ఒక బౌల్‌లో ఆలివ్ ఆయిల్ మ‌రియు తేనె స‌మానంగా తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని పెదాల‌కు అప్లై చేసి.రెండు నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.బాగా ఆరిన త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో పెదాల‌ను శుభ్రం చేసుకోవాలి.

ఇలా ఉద‌యం, సాయంత్రం చేస్తూ ఉంటే.ప‌గిలిన పెద‌వులు నున్న‌బ‌డ‌తాయి.

#Lip Packs #Beauty #Lips #Lip Care #Beauty Tips

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు