పశ్చిమ గోదావరి లో విషాదం,హోంక్వారంటైన్ లో వ్యక్తి మృతి  

Home Quarantine West Godavari Man Died - Telugu Accident, Corona Positive, Home Quarantine, West Godavari

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది.అయితే ఇటీవల కొత్తగూడెం డీఎస్సీ కుమారుడు హాజరైన ఒక గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరైన నేపథ్యంలో అతడితో పాటు ఆ కార్యక్రమానికి హాజరైన 90 మందిని గుర్తించి హోం క్వారంటైన్ లో ఉండాలని అధికారులు సూచించారు.

 Home Quarantine West Godavari Man Died

దీనితో గత కొద్దీ రోజులుగా హోం క్వారంటైన్ లోనే ఉంటున్న అతడు ప్రమాదవశాత్తు బుధవారం ఉదయం వంటింట్లో కాలుజారి కిందపడడం తో అక్కడే ఉన్న కత్తి అతని గుండెల్లో దిగినట్లు తెలుస్తుంది.దీనితో తీవ్ర రక్తస్రావం కావడం తో ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్లు తెలుస్తుంది.
చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన తో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.కొత్తగూడెం డీఎస్సీ కుమారుడి కి కరోనా పాజిటివ్ రావడం తో అతడు హాజరైన ఓ గృహ ప్రవేశ కార్యక్రమానికి వచ్చిన 90 మందిని గుర్తించిన అధికారులు హోం క్వారంటైన్ లోనే ఉండాలని సూచించారు.

దీనితో అప్పటి నుంచి అతడు తన భార్యతోనే కలిసి ఇంట్లోనే ఉంటున్నాడు.

పశ్చిమ గోదావరి లో విషాదం,హోంక్వారంటైన్ లో వ్యక్తి మృతి-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ రోజు ఉదయం సమయంలో వంటింట్లోకి వెళ్లగా అక్కడ ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడడం తో అప్పటికే అక్కడ కత్తి ఉండటంతో అది నేరుగా గుండెల్లో గుచ్చుకుంది.అతని మరణంతో గ్రామంలో విషాదం నెలకొంది.కరోనా నుంచి రక్షించేందుకు హోం క్వారంటైన్ చేస్తే మృత్యువు అతన్ని ఈ రూపంలో తీసుకెళ్లిందంటూ పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Home Quarantine West Godavari Man Died Related Telugu News,Photos/Pics,Images..