గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 67వ రోజు తాళ్లపూడి మండలం వేగేశ్వరపురంలో హోంమంత్రి తానేటి వనిత గారు పర్యటించారు.ఈ మూడు సంవత్సరాల కాలంలో సీఎం జగన్ గారు అందించిన ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరించారు.
గ్రామం లోని చిన్నారులు, మహిళలు, వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ.
వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
సీఎం జగన్ గారు అందిస్తున్న సంక్షేమ పథకాలు తమ జీవితాలలో వెలుగులు నింపాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తంచేశారు.ప్రజా సమస్యలను తెలుసుకోని వాటిని పరిష్కరించేందుకే గడప గడప కార్యక్రమాన్ని చేస్తున్నట్లు హోంమంత్రి తానేటి వనిత గారు స్పష్టంచేశారు.