బక్రీద్ వేళ ఆవులను బలివ్వొద్దు : హోం మంత్రి

బక్రీద్.ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండగల్లో ఒకటి.బక్రీద్‌ను ఖుర్భాని పండుగ అని కూడా అంటారు.త్యాగానికి ప్రతీకగా ముస్లింలు ఈ పండగ జరుపుకుంటారు.ఈ సందర్భంగా జంతువులను బలి ఇస్తారు.ఈ క్రమంలో కొందరు హిందువులు పవిత్రంగా భావించే గోవులను కూడా బలి ఇస్తారు.

 Do Not Sacrifice Cows During Bakrid: Home Minister, Telangana Home Minister Moh-TeluguStop.com

ఈ విషయంలో ముస్లింలకు అవగాహన కల్పించిన ప్రతి ఏడాది పలు చోట్ల గోవథలు జరుగుతూనే ఉన్నాయి.ఈ క్రమంలో తెలంగాణ హోం మంత్రి హోం మంత్రి మహమూద్ అలీ బక్రీద్ సందర్బంగా తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీ ఎం మహేందర్‌రెడ్డితో శనివారం లక్డీకాపూల్‌లోని తన కార్యాలయంలో సమీక్షించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.

బక్రీద్ సందర్బంగా ఆవులను బలి ఇవ్వద్దని ముస్లిం సోదరులకు విజ్ఞప్తి చేశారు మంత్రి.

రాష్ట్రంలో ఎంతో మతసామరస్యం ఉందని, సీఎం కేసీఆర్‌ అన్ని మతాలకు సమ ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.ఇదే సోదరభావం కొనసాగేలా బక్రీద్‌ జరుపుకోవాలని మంత్రి ముస్లింలకు సూచించారు.

హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆవులను బక్రీద్‌ సందర్భంగా బలి ఇవ్వవద్దని ఆయన కోరారు.మేకలు ఇతర జంతువుల రవాణాలో పోలీసుల సహకారం ఉంటుందని, ఆవులను తరలించేవారిపై కేసులు నమోదుచేయడంతోపాటు జైలుకు పంపుతారని హెచ్చరించారు.

బక్రీద్‌ సందర్భంగా శుభ్రతపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని, వ్యర్థాలను రోడ్లపైవేసి ఇతరులకు అసౌకర్యం కలిగించవద్దని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube