హోంమంత్రి హోమ్ కే పరిమితమా ? అదే సీన్ రిపీట్ అవుతోందిగా ?  

Home Minister Mekatoti Sucharita Cabinet - Telugu Ap, Bjp, Cabinet, Home Minister, Mekatoti Sucharita, Ys Jagan

పేరుకే వారంతా మంత్రులు తప్ప పెత్తనమంతా సీఎం చేతిలోనే ఉండిపోవడంతో తమ హవా ఎక్కడ చెల్లుబాటు కాకపోవడంతో చాలాకాలంగా ఏపీ క్యాబినెట్ లో మంత్రులు జగన్ తీరుపై అసంతృప్తిగానే ఉంటూ వస్తున్నారు.అన్ని శాఖల మీద ఎప్పటికీ జగన్ ఒక్కడి పెత్తనమే కొనసాగుతూ వస్తోంది మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన ఏ ఒక్క నిర్ణయము ఏ ఒక్క ఆదేశం ఇవ్వలేని పరిస్థితుల్లో మంత్రులు ఉన్నారనే ప్రచారం ఏపీలో పెద్ద ఎత్తున కొనసాగుతూ వస్తోంది.

 Home Minister Mekatoti Sucharita Cabinet

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏపీ చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది.రోజురోజుకు ఏపీలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆందోళనకరంగా ఉంది.

ఈ పరిస్థితుల్లో జగన్ క్యాబినెట్ లో కీలక శాఖ నిర్వహిస్తున్న హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రస్తావన వస్తోంది.ఏపీలో అమలవుతున్న లాక్ డౌన్ నిబంధన సమర్థవంతంగా నిర్వహించి ప్రజలందరూ రోడ్ల పైకి రాకుండా చూసుకునే బాధ్యత పోలీస్ శాఖ పర్యవేక్షిస్తోంది.
ఈ సమయంలో హోం మంత్రిగా ఉన్న సుచరిత తరచు అధికారులతో మాట్లాడుతూ, ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ పరిస్థితిని చక్క దిద్దుతూ ఉండాలి.అలాగే ప్రజలకు, అధికారులకు భరోసా కల్పించే విధంగా ఆమె ఈ కీలక సమయంలో వ్యవహరించాల్సి ఉంటుంది.

హోంమంత్రి హోమ్ కే పరిమితమా అదే సీన్ రిపీట్ అవుతోందిగా -Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఆమె మాత్రం పూర్తిగా మౌనంగా ఉండిపోవడం, కేవలం బిజెపి లేక సీఎం జగన్ మాత్రమే మీడియా ముందుకు వచ్చి కీలక నిర్ణయాలు ప్రకటిస్తూ ఉండడంతో పదవిలో ఉన్న హోం మంత్రి పాత్ర అలంకార ప్రాయమే అన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది.
మేకతోటి సుచరిత వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు.

దీంతో ఆమెకు జగన్ హోం మంత్రిగా తన క్యాబినెట్ లో అవకాశం కల్పించి అందర్నీ ఆశ్చర్యపరిచారు జగన్.ఆమె ఎస్సీ సామాజిక వర్గానికి చెందడం మహిళా కోట ఈ రెండు ఆమెకు హోం మంత్రి పదవిని కట్టబెట్టాయి.

ఇంత వరకు బాగానే ఉన్నా, ఆమెకు మాత్రం శాంతిభద్రతలకు సంబంధించిన విషయంలో గానీ, మరే విషయంలో కానీ పూర్తి స్వేచ్ఛను అయితే జగన్ కల్పించలేదని విమర్శలు కూడా లేకపోలేదు.ఆమె కూడా ఏ విషయంలోనూ పెద్దగా స్పందించకపోవడం, ప్రతిదానికి జగన్ మాత్రమే స్పందించడం ఇవన్నీ ఆమె పదవి అలంకార ప్రాయమే అన్న విషయాన్ని తెలియజేస్తోంది.

ఈ తరహా వ్యవహారం కొత్తేమి కాదు.దివంగత రాజశేఖర్ రెడ్డి హయాంలోనూ ఇదే అనిపించింది.అప్పట్లో రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హోంమంత్రిగా సబితా ఇంద్రా రెడ్డిని నియమించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.ఒక మహిళకు హోంమంత్రి పదవి ఇవ్వడం నిజంగా అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అయితే పేరుకి ఆమె హోంమంత్రిగా ఉన్న శాంతిభద్రతల విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ మొత్తం వ్యవహారమంతా వైయస్ రాజశేఖరరెడ్డి మాత్రమే చూస్తూ ఉండేవాడు.సబితా ఇంద్రారెడ్డి హోంమంత్రిగా ఉన్న కేవలం అలంకార ప్రాయంగా మాత్రమే ఆ పదవిలో కొనసాగుతున్నారని విమర్శలు సైతం ఆమె ఎదుర్కొన్నారు.

ఇప్పుడు వైయస్ జగన్ కాబినెట్ లోను సుచరిత వ్యవహారం ఇదే విధంగా ఉండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Home Minister Mekatoti Sucharita Cabinet Related Telugu News,Photos/Pics,Images..