నేడే సదరన్ జోనల్ కౌన్సిల్...సమస్యలు పరిష్కారమయ్యేనా?

నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో సదరన్ జనరల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ రాష్ట్రాలు పాల్గొననున్నాయి.

 Home Minister Amit Shah To Chair South Zonal Council Meeting In Tirupati On Nov-TeluguStop.com

అయితే ఈ సమావేశానికి  ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ నుండి సీఎం జగన్, కర్ణాటక నుండి ముఖ్యమమంత్రి బసవరాజ్ బొమ్మై మాత్రమే హాజరావుతున్నారు.మిగతా రాష్ట్రాల నుండి ప్రతినిధులుగా మంత్రులు పాల్గొననున్నారు.

ఇక ఈ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండటంతో అన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రాల సమస్యలతో సన్నద్దమై ఉన్నాయి.తమ సమస్యలను అమిత్ షా ముందుంచడమే కాక పరిష్కారానికి కూడా డిమాండ్ చేసే అవకాశం కనిపిస్తోంది.

అయితే ప్రతి సమావేశంలాగానే సమస్యలను విని పరిష్కరిస్తామని చెప్పి కాలయాపన చేస్తారా లేక పరిష్కారానికి చొరవ చూపుతారా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Telugu @amitshah, Ap Cm Jagan, Cmbasvaraju, Cm Kcr, Amit Shah, Amitshah, Jagan,

అయితే తెలంగాణ నుండి కొన్ని పధకాలకు నిధులు మంజూరు చేయమని కోరడమే కాదు, పెండింగ్ బకాయిలపై ఒక స్పష్టమైన సమాధానం కోరే అవకాశం ఉంది.ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ హాజరవుతున్న నేపథ్యంలో మూడు రాజధానుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది.మరి ఈ సమస్యల పట్ల అమిత్ షా ఏవిధంగా స్పందిస్తారనేది చూడాల్సి ఉంది.

అయితే కేంద్రం ఈ తరహా సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం తో రాష్ట్రాల సమస్యలపై ముందుకు రావడం ఒకింత అభినందించదగ్గ అంశమని కాని సమావేశం ఏర్పాటు చేయడమే కాకుండా సమస్యల పరిష్కారానికి చొరవ చూపితేనే సమావేశం ఏర్పాటు చేసినందుకు ఒక సార్థకత ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.అయితే కేంద్రం మాత్రం అన్ని సమస్యలను విని సాధ్యమైనంత మేర పరిష్కారానికి కొంత చొరవ చూపే అవకాశముందని పలు వర్గాలలో చర్చ జరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube