కేజీఎఫ్ మేకర్స్ సర్ ప్రైజ్... యువరాజ్ కుమార్ తెరంగేట్రం!

కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా నటించిన కేజిఎఫ్ సినిమా ఇటీవలే విడుదలై ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించనివిధంగా కలెక్షన్స్ ను రాబట్టింది.

 Hombale Films New Movie Yuva Rajkumar Kgf Movie, Yuva Raj, Puneeth Rajkumar, Raj-TeluguStop.com

ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా విడుదల అయ్యి ప్రపంచవ్యాప్తంగా రికార్డులను సృష్టించింది.కేజిఎఫ్ చాప్టర్ వన్ సినిమా ఎంతటి విజయం సాధించిందో, కే జి ఎఫ్ చాప్టర్ 2 కూడా ఇటీవలే విడుదల అయి ప్రస్తుతం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

ఇక ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ దర్శకుడు ప్రశాంత్ నీల్ పై, హీరో యష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అయితే ఈ సినిమా విడుదల అయిన తర్వాత దర్శకుడికి హీరోకి ఎంత పేరు వచ్చిందో, ఆ సినిమా నిర్మాత సంస్థ అయిన హోంబలే ఫిలిమ్స్ కు అంతటి పేరు వచ్చింది.

ఈ సినిమా తరువాత హోంబలే ఫిలిమ్స్ సంస్థ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.ఇది ఇలా ఉంటే తాజాగా హోంబలే ఫిలిమ్స్ సంస్థ తన తదుపరి సినిమాను ప్రకటించి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది.

కన్నడ కంఠీరవ, లెజండ్రీ నటుడు అయిన రాజ్ కుమార్ మనవడు, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ సోదరుడు అయినా యువ రాజ్ కుమార్ తో హోంబలే ఫిలిమ్స్ సంస్థ కొత్త సినిమాను నిర్మించబోతోంది.ఈ క్రమంలోనే హీరో యువరాజు కు సంబంధించిన లుక్ తో కూడిన పోస్టర్ ను విడుదల చేసింది.

ఈ సినిమాతోనే యువ రాజ్ కుమార్ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు.ఇకపోతే హీరో యువరాజ్ ఇంట్రడక్షన్ పోస్టర్ విడుదల చేస్తూ దానికి వారసత్వం కొనసాగుతుందని క్యాప్షన్ ఇచ్చారు.పునీత్ రాజ్ కుమార్ కు యువరత్న లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను అందించిన సంతోషం ఆనంద్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఇకపోతే యువ రాజ్ కుమార్ ఇంట్రడక్షన్ పోస్ట్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ పోస్ట్ ని చూసిన పునీత్ అభిమానులు యంగ్ అప్ కమింగ్ హీరో అయిన యువ రాజ్ కుమార్ కి వెల్కమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube