NTR 30 : ‘ఎన్టీఆర్30’పై పెరుగుతున్న భారీ అంచనాలు.. ఇంపాజిబుల్ యాక్షన్ మాస్టర్ ఎంట్రీ?

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎన్టీఆర్( NTR ) కు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలలో ఏ రేంజ్ లో ఫాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే.

 Hollywood Stunt Master Kenny Bates Joins Ntr 30 Team-TeluguStop.com

ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ 30 వ సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎన్టీఆర్ 30వ( NTR 30 ) సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాకు దర్శకుడు కొరటాల శివ ( Koratala Shiva )దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న రెండవ సినిమా ఇది.ఇది ఇలా ఉంటే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైంది.మార్చి 30వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.కాగా ఇందులో ఫ్యూజ్ వాటర్ సీక్వెన్స్ లు ఉన్నాయి.వాటిని రియల్ ఫుటేజ్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ని మిక్స్ చేస్తూ డిజైన్ చేస్తున్నట్లు ఇటీవలే కెమెరామెన్ రత్న వేలు తెలిపిన విషయం తెలిసిందే.

సముద్ర తీరంలో భారీ యాక్షన్ ఈ సినిమా తీయాలి అంటే అంత మంచి టెక్నీషియన్స్( Technicians ) ఉండాలి.ఇది ఇలా ఉంటే డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాలోని ఫైట్స్ కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్ ని రంగంలోకి దింపాడు.మిషన్ ఇంపాజిబుల్ వంటి హాలీవుడ్ సినిమాలకు భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ని డిజైన్ చేసిన కేన్ని బేట్స్ ని రంగంలోకి దింపారు.ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్టీఆర్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

కేన్ని బేట్స్ లాంటి హాలీవుడ్ స్టంట్ మాస్టర్లను రంగంలోకి దింపారు అంటే ఈ సినిమాను భారీగా డిజైన్ చేయబోతున్నారని అర్థమవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube