ఆర్ఆర్ఆర్ లో తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్!  

తారక్ కోసం హాలీవుడ్ భామని రంగంలోకి దించుతున్న రాజమౌళి. .

Hollywood Heroine Romance With Jr Ntr In Rrr-hollywood Heroine,jr Ntr,rajamouli,ram Charan,rrr,tollywood

బాహుబలి తర్వాత రాజమౌళి మరో సారి భారీ బడ్జెట్ తో రామ్ చరణ్, తారక్ కాంబినేషన్ భారీ మల్టీ స్టారర్ ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఈ సినిమాని టైటిల్ ని ఆర్ ఆర్ ఆర్ గా ఫిక్స్ చేసినట్లు మీడియా సమావేశంలో స్పష్టం చేసిన జక్కన్న సినిమా స్టొరీని కూడా రివీల్ చేసారు. అలాగే ఇందులో నటిస్తున్న స్టార్ కాస్టింగ్ కూడా పరిచయం చేసాడు...

ఆర్ఆర్ఆర్ లో తారక్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్!-Hollywood Heroine Romance With Jr NTR In RRR

హాలీవుడ్ స్టాండర్డ్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా లో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా బట్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు జక్కన్న స్పష్టం చేసారు.

అలాగే ఈ సినిమాలో తారక్ కి జోడీగా హాలీవుడ్ భామని రాజమౌళి రంగంలోకి దించుతున్నాడు. హాలీవుడ్ సినిమాలతో పాటు టెలివిజన్ సిరిస్ లలో కూడా నటిస్తున్న డైసీ ఎడ్జర్ జోన్స్ లో నటిస్తున్నట్లు తెలియజేసారు.

ఆమె బ్రిటిష్ క్వీన్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలియజేసారు. ఇందులో కొమరాం భీమ్ పాత్రలో తారక్ నటిస్తూ ఉండటం అతనికి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ని ఫైనల్ చేయడం ద్వారా ఈ సినిమాకి హాలీవుడ్ మార్కెట్ పై కూడా రాజమౌళి కన్నేసాడని స్పష్టం అవుతుంది. 300 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమా జులై 30 2020లో రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు.