‘ఆర్ఆర్ఆర్’ కోసం వెయిటింగ్ అంటున్న హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరిస్..!

గత రెండు మూడు సంవత్సరాల నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కడం చాలా పరిపాటిగా మారిపోయింది.ఇక తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్.

 Rrr Movie, Olivia Morris, Junior Ntr, Ram Charan, Social Media, Instagram, Video-TeluguStop.com

ఈ సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీకు చెందిన ఇద్దరు బడా హీరోలు నందమూరి తారక రామారావు, అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీంగా, అలాగే రామ్ చరణ్ తేజ్ మన్నెం దొర అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.

ఇకపోతే కరోనా వైరస్ కారణంగా ఇన్ని రోజులు షూటింగ్ కు బ్రేక్ పడగా ఈ మధ్య కాలంలోనే షూటింగ్ మళ్లీ మొదలుపెట్టారు.

ఇందుకు సంబంధించి ఈ సినిమాలో నటించడానికి లేడీ స్కాట్ గా నటించడానికి హాలీవుడ్ హీరోయిన్ ఆలిసన్ డూడి అడుగుపెట్టింది.

బాలీవుడ్ నటి అలియా భట్ కూడా అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ లో అడుగుపెట్టబోతోంది.ఇక ఈ లిస్టులో మిగిలింది హాలీవుడ్ తార ఒలీవియా మోరీస్.

కరోనా వైరస్ తీవ్రత వల్ల ఆవిడ షూటింగ్ లో పాల్గొనడానికి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో కొందరు ఈ సినిమాలో ఆవిడ నటించబోదని వార్తలు కూడా వస్తున్నాయి.

అయితే ఈ విషయానికి చెక్ పెడుతూ తాజాగా హాలీవుడ్ తార ఓలివియా మోరిస్ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేసింది.ఈ వీడియోలో గత సంవత్సరం ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం తాను భారతదేశానికి వచ్చినప్పుడు తీసిన వీడియోను పోస్ట్ చేసింది.

ఈ పోస్ట్ లో తాను ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆవిడ తెలిపింది.ఇకపోతే ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరీస్ నటిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube