ఆ హిందీ సినిమా కోసం ప్రభాస్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే.ఏకంగా ఐదేళ్ళ పాటు గ్యాప్ లేకుండా పాన్ ఇండియా మూవీలని ఒకే చేసేశాడు.

 Hollywood Beauty In Prabhas And Siddharth Anand Film, Tollywood, Adi Purush, Bol-TeluguStop.com

ఈ సినిమా లు రిలీజ్ అయ్యి హిట్ అయితే అతని ఇమేజ్ ఇంటర్నేషనల్ స్థాయికి చేరిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలు పాన్ ఇండియా రేంజ్ మూవీలే అయినా తరువాత నాగ్ అశ్విన్ సినిమా మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తెరకెక్కించబోతున్నారు.

ఇండియన్ లాంగ్వేజ్ లతో పాటు విదేశీ బాషలలో కూడా ఈ మూవీని రిలీజ్ చేసే ప్లాన్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ ఉన్నాడు.దానికోసం హాలీవుడ్ నటులతో పాటు విదేశీ యాక్టర్స్ ని కూడా కథలో భాగం చేయబోతున్నాడు.

సైన్స్ ఫిక్షన్ కథాంశం కావడంతో ఇండియా బ్యాక్ డ్రాప్ లోనే కథని చెప్పే ప్రయత్నం చేసిన అన్ని దేశాల నటులు కూడా ఉండే విధంగా స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.దీని తర్వాత సిద్దార్ద్ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీగా యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో సినిమా చేయబోతున్నాడు.

ఇప్పటికే సిద్దార్ద్ చెప్పిన కథకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది.ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా హాలీవుడ్ హీరోయిన్ ని రంగంలోకి దించడానికి దర్శకుడు సిద్దార్ద్ ఆనంద్ ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం.

ఆమె ఎవరనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube