కొడుకుతో కలిసి నదిలో షికారు: ఐదు రోజుల తర్వాత శవమై తేలిన అమెరికన్ నటి  

hollywood actress naya rivera dead body found in California lake, hollywood actress naya rivera , California lake,naya rivera dead body - Telugu California Lake, Hollywood Actress Naya Rivera, Hollywood Actress Naya Rivera Dead Body Found In California Lake, Naya Rivera Dead Body

గత కొన్ని నెలలుగా సినీ తారల ఆకస్మిక మరణాలతో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు.ఈ క్రమంలో కుమారుడితో కలిసి నది విహారానికి వెళ్లిన అమెరికన్ నటి నయా రివీరా కథ విషాదాంతం అయ్యింది.

 Hollywood Actress Naya Rivera Dead Body Found

బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రివీరా ఓ బోటును అద్దెకు తీసుకుని తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి కాలిఫోర్నియాలోని పెరూ లేక్‌లో షికారుకు వెళ్లింది.

సాయంత్రం అవుతున్నా రివీరా తిరిగి రాకపోవడంతో బోటు యాజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొడుకుతో కలిసి నదిలో షికారు: ఐదు రోజుల తర్వాత శవమై తేలిన అమెరికన్ నటి-Telugu NRI-Telugu Tollywood Photo Image

దీంతో రంగంలోకి దిగిన సహాయక బృందం ఆ రోజు రాత్రే బోటును గుర్తించారు.అయితే రివీరా కుమారుడు మాత్రమే ఉండటంతో సిబ్బంది ఆందోళన పడ్డారు.ఆ పిల్లాడి పక్కనే ఓ లైఫ్ జాకెట్, రివీరా హ్యాండ్ బ్యాగ్ పడివున్నాయి.

దీంతో ఆమె కోసం సహాయక బృందాలు హెలికాఫ్టర్లు, డ్రోన్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.

గత ఐదు రోజులుగా నిర్వహిస్తున్న గాలింపు చర్యల్లో భాగంగా మంగళవారం ఉదయం రివీరా మృతదేహం లభ్యమైంది.దీంతో హాలీవుడ్ ప్రముఖులు, ఆమె అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఫాక్స్ మ్యూజికల్ కామెడీ చిత్రం ‘‘గ్లీ’’ ద్వారా రివీరా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

#California Lake

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Hollywood Actress Naya Rivera Dead Body Found Related Telugu News,Photos/Pics,Images..